నాగబాబుకు ఆటో రాంప్రసాద్ చురక.. కమెడియన్ జబర్దస్త్ పంచ్..

జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఆటో రాంప్రసాద్ పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడిటర్‌గా ఇండస్ట్రీకి వచ్చి రైటర్‌ గా ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు రాంప్రసాద్. ప్రస్తుతం హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు రాంప్రసాద్. తన స్నేహితులతో కలిసి 3 మంకీస్ సినిమా చేసాడు ఈయన. ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి నటించడంతో ఆసక్తి కూడా బాగానే ఉంది. అయితే సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది పక్కనబెడితే ప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం జబర్దస్త్ టీం అంతా కలిసి వచ్చారు. అంతా కలిసి సుడిగాలి సుధీర్ టీం నటించిన సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షోపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు ఈయన.

Image result for auto ramprasad

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే ఆలోచన ఉందా.. చాలా కొత్త షోలు మొదలవుతున్నాయి కదా అందులోంచి ఆఫర్స్ రావడం లేదా.. ఎందుకు వెళ్లట్లేదని అడిగితే సంచలన సమాధానం చెప్పాడు రాంప్రసాద్. ‘జబర్దస్త్‌’లో చేస్తే వచ్చే పేరు ఇక ఏ షోలో చేసినా రాదు. అందుకే నేను వేరే ఏ షోకి వెళ్లలేదు. ‘జబర్దస్త్‌’ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అది ఒక మ్యాజిక్. మళ్లీ ఒక కొత్త షోతో అలాంటి మ్యాజిక్ జరగాలంటే సాధ్యం కాదు. కొందరు వెళ్లిపోయారు. అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ వచినంతపేరు వాళ్లకు అక్కడ రాదు. డబ్బు కోసం వెళ్ళేవాళ్ళు వెళ్లారు. కానీ డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు. పేరు కూడా ముఖ్యం. మేము ఇప్పుడు ఇలా ఉన్నాం అంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ జబర్దస్త్. అన్నం పెట్టిన దానిని కాదని వేరే చోటుకు ఎందుకు వెళ్తాం. ఎవరు ఎన్నో ఆఫర్స్ ఇచ్చినా కూడా జబర్దస్త్ ను వదిలివెళ్లే ప్రసక్తే లేదు. జబర్దస్త్ ఉన్నంతవరకు మేము జబర్దస్త్ తోనే ఉంటామని క్లారిటీ ఇచ్చాడు రామ్ ప్రసాద్.

ఈ క్రింది వీడియోని చూడండి

తనతో పాటు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఇక్కడే ఉంటామని కన్ఫర్మ్ చేసాడు. ఈయన మాటలు బట్టి చూస్తుంటే నాగబాబుకు కూడా భారీ షాక్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. కొత్త షో.. కొత్త పారితోషికం అని వెళ్లిన నాగబాబుకు ఇప్పుడక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. చెక్కులు ఎక్కువే వస్తున్నా కూడా షో ఫ్లాప్ కావడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. షోకు పాపులారిటీ తీసుకురావడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కానీ షో కు గుర్తింపు రావడం లేదు. అందుకే నాగబాబు కూడా జబర్దస్త్ కు రిటర్న్ వచ్చేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి పుట్టిస్తున్నాయి. ఎన్ని షోలు వచ్చినా కూడా జబర్దస్త్ ముందు తుస్ అంటున్నాడు ఈయన. బయట పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. జీ తెలుగులో మొదలైన అదిరింది షోకు కూడా అంతగా ఆదరణ రావడం లేదు. ఇలాంటి టైమ్‌లో రాంప్రసాద్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation