ఫ్యాన్స్‌పై సుడిగాలి సుధీర్ సంచలన కామెంట్స్.. ఇలా అంటాడని కలలో కూడా ఊహించలేదు..

139

తెలుగు రియాల్టీ షోస్ లో జబర్దస్త్ కామెడీ షో నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకి వినోదం అందించడమే లక్ష్యంగా ఈ షో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది సామాన్యులు తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. దీని ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకొని సినిమాలలో నటిస్తున్న కమెడియన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ తరువాత ఢీ, పోరాపోవే షోలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సినిమాలలో కూడా బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. దీనితో సుధీర్ బాగా బిజీ అయిపోయాడు.తాను ఎంత బిజీగా ఉన్న కూడా తనకి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని మాత్రం వదలడంలేదు.

ఫ్యాన్స్‌పై సుడిగాలి సుధీర్ సంచలన కామెంట్స్..

అయితే ఇప్పుడు సుదీర్ హీరోగా 3 మంకీస్ అనే సినిమా వస్తుంది. ఇందులో గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లు కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా తర్వాత 3 మంకీస్‌తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గెటప్‌ శ్రీను, రాం ప్రసాద్‌ సహా సుధీర్ ప్రధాన పాత్రలుగా అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 3 మంకీస్ చిత్రాన్ని నగేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని జబర్దస్త్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో సినిమాపై, ఫ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాత్ర చేశా. మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్‌ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్‌ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. ఇక నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా ఫాన్స్. నా ఫ్యాన్సే నా ఫ్యామిలీ , వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను. నేను హీరోగా చేసిన సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమాకు కమిట్‌ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో ట్యాగ్‌ వద్దే వద్దు అని అన్నాడు సుధీర్. ఇలా ఫాన్స్ ను తన ఫ్యామిలీ అని అనడంతో అయన ఫాన్స్ చాలా సంతోషిస్తున్నారు. ఏ హీరో అయినా, నటుడు అయినా సరే ఫాన్స్ ను తన ఫామిలీ అని చాలా తక్కువ మంది అనుకుంటారు. అలాంటి వారిలో మా సుదీర్ అన్న ఉండటం చాలా గర్వంగా ఉందని సుదీర్ ఫాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. 3 మంకీస్ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation