జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

231

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు . ఈ ఒక్క షో వల్ల ఎంతో మంది జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. యాంకర్ అనసూయ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ పంచులతో పరేషాన్ చేసే వారే. తమపై తామే పంచులేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయింది జబర్డస్త్ టీమ్. ఈ ఒక్క షో ద్వారానే అందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మంచి పాపులారిటీ దక్కింది. తమ తమ స్కిట్స్ ద్వారా ఒక్కొక్కరూ ఒక్కో ట్యాగ్‌తో క్రేజ్ కొట్టేశారు. అయితే ఈ షోలో ఇప్పుడు చాలా పెద్ద గొడవ జరిగింది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కొన్నిసార్లు కామెడీ కూడా సీరియస్ అవుతుంటుంది. ఇఫ్పుడు కూడా ఇదే జరిగింది. ఎప్పుడూ నవ్వులు పంచే జబర్దస్త్ కామెడీ షో ఇప్పుడు సీరియస్ అయింది. అందులో ఓ స్కిట్‌లో భాగంగా బుల్లెట్ భాస్కర్, అప్పారావు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలోనే భాస్కర్‌ను బండ బూతులు తిట్టాడు అప్పారావు. విషయం ఏంటంటే.. స్కిట్‌ లో భాగంగా అప్పారావును భాస్కర్ కొట్టాలి.. ఆ స్కిట్‌లో అంతా కొట్టుకుంటూనే ఉంటారు. అలాగే మిగిలిన వాళ్లతో పాటు అప్పారావుని భాస్కర్ కర్రతో గట్టిగా కొడతాడు.

అయితే స్కిట్ లో భాగంగా కొడుతున్నాడన్న భావనలో భాస్కర్ ఉండగా అప్పారావుకి అవి బాగా తగలడంతో ఫైర్ అయ్యాడు. స్కిట్ మధ్యలో ఆపేసి భాస్కర్ తో గొడవ పడ్డాడు. అప్పారావు షర్ట్ విప్పి ఒంటిమీద వాతలు చూపించాడు. తాను కూడా ఒక టీం లీడర్ నే అని నన్ను ఇలా కొడతావా అంటూ గొడవపడి మరి స్కిట్ మధ్యలో స్టేజ్ దిగేశాడు అప్పారావు. ఈ ఘటన భాస్కర్ టీం మాత్రమే కాదు ఈ ఊహించని సంఘటన ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జులను, యాంకర్ రష్మిని కూడా షాక్ అయ్యేలా చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కొన్నిసార్లు కమెడియన్స్ బాధపడే అంశాలు జరిగినా అవి బయటకు రానివ్వరు కాని వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో భాస్కర్ తో అప్పారావు గొడవ చూపించి షాక్ ఇచ్చారు. నిజంగానే గొడవ జరిగినట్టు అనిపిస్తుండగా ఒకవేళ స్కిట్ లో భాగంగా అలా ఏమన్నా చేశారా అన్న ఆలోచనలు వస్తున్నాయి.

జబర్దస్త్ తో రియల్ ఫైట్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన కంటెస్టంట్..!

గతంలో కూడా అప్పారావు ఇలాగే చేసాడు ఓసారి. అప్పట్లో షకలక శంకర్ టీంలో ఉన్నపుడు కూడా ఇలాగే కొడితే.. సీరియస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత అది స్కిట్‌లో భాగమే అని చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నారు నెటిజన్లు. కానీ స్టేజీపై అప్పారావు తిట్టిన తీరు చూస్తుంటే మాత్రం మ్యాటర్ సీరియస్ అని అర్థమవుతుంది. ఇదంతా జరుగుతుంటే యాంకర్ రష్మితో పాటు జడ్జిలు కూడా అలాగే చూస్తుండిపోయారు. ఏది ఏమైనా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో భాస్కర్, అప్పారావు వచ్చే వారం ఎపిసోడ్ లో ఏం చేస్తారు అన్నది హాట్ న్యూస్ గా మారింది. అది నిజంగానే జరిగితే షోలో కంటిస్టంట్స్ మధ్య డిస్టన్స్ గురించి బయట వినిపించే వార్తలు నిజమే అని నమ్మొచ్చు.

Content above bottom navigation