ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

తెలుగు వారి సత్తాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన sr.NTR గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ గారి కొడుకు. చిన్నవయసు నుండే తాతగారి నుండి నటనను పుణికి పుచ్చుకున్నాడు. కొందరు నటులు డాన్స్ చేస్తారు, కొందరు డైలాగ్స్ డెలివరీలో బెస్ట్ ఉంటారు. మరియు కొందరు పాటలు పాడుతూ ఉంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. అతను ఒక గొప్ప నటుడు, డాన్సర్, సింగర్ మరియు డైలాగ్స్ డెలివరీలో చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయాలు అందరికి తెలుసు కానీ ఎన్టీఆర్ ఆస్థి విలువ ఎంతో మీకు తెలుసా? ఎన్టీఆర్ ఆస్థి విలువ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

Image result for ntr

నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణకు 200 కోట్లు వారసత్వంగా ఇచ్చాడు. ఆ సంపదను హరికృష్ణ 1800 కోట్లు చేసి, తన వారసులకు సమానంగా పంచాడు. అలా ఎన్టీఆర్ కు వారసత్వంగా 600కోట్లు వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని కొంతకాలంగా బిజినెస్ చేస్తూ, సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించాడు ఎన్టీఆర్. అంతేకాకుండా నవరత్న ఆయిల్, పౌడర్ యాడ్స్ లో నటించి చాలా సంపాదించాడు ఎన్టీఆర్. మలబార్ గోల్డ్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ తీసుకొని బాగానే పోగుచేశాడు ఎన్టీఆర్. తన భార్య లక్ష్మి ప్రణతి తన పుట్టింటి నుంచి 500 కోట్లు తీసుకొచ్చింది. ఇలా ఎన్టీఆర్ ఆస్తుల విలువ మొత్తంగా 2300 కోట్లు. టాలీవుడ్ లో డబ్బున్న హీరోల్లో ఎన్టీఆర్ 7 వ స్థానంలో ఉన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

ఎన్టీఆర్ దగ్గర ఉన్న విలువైన వస్తువుల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ వాడే ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఆంపైర్’ వాచ్ ధర అక్షరాల 19 లక్షలు, అలాగే ‘ఆడమస్ ఫైగస్ట్ ఓక్ ఆఫ్షోర్ ఫోర్జ్డ్ కార్బన్ ‘ అనే రెండో వాచ్ 20 లక్షలు పైనే.. ‘ బివిఎల్ గరి బై రిట్రో స్టీల్ సెర్మైక్ ’ అనే వాచ్ ధర 7 లక్షల 12 వేలు. ‘పనెరై లుమినర్ సబ్ మెర్స బుల్’ వాచ్ ధర 5 లక్షలు. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర అక్షరాల 2 కోట్ల 20 లక్షలట. ఇక ‘ఎన్టీఆర్ వాడే పోర్స్చ్ 911’ కారు ధర కోటిన్నరకు పైనే.. ఇక మరో రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ కారు 2.5 కోట్లు. మరో కారు ‘బెంజ్ 4 మెటిక్’ ధర కోటి ఇరవై లక్షలు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఉంటున్న ఇంటి ఖరీదు 50 కోట్లు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొన్ని యాడ్స్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఒక్కో యాడ్ కు కోటిన్నర వరకూ తీసుకుంటాడని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ఆస్థి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. .

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation