breakingnews : కాజల్ కు త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

118

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో ఇప్పుడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దుర్ఘటనలో డైరెక్టర్ శంకర్‌ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. శంకర్ సహా గాయపడిన వారందరినీ వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

Image result for kajal

ఈ విషాద ఘటనపై నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగాన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యాక్సిడెంట్ స్పాట్‌లో కాజల్ కూడా ఉన్నారట. వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడ్డానని అంటున్నారు. ‘‘ఈ ఘటనపై నేను ఎంత బాధపడుతున్నానో చెప్పడానికి మాటలు రావడం లేదు. నా ముగ్గురు కొలీగ్స్‌ ను కోల్పోయాను. వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ముగ్గురు స్నేహితుల ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్న రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో వెంట్రుక వాసిలో నేను తప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు ట్వీట్స్ చేయగలుగుతున్నాను. సమయం, జీవితం గురించి పెద్ద గుణపాఠాలే నేర్చుకున్నాను అని తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కమల్ హాసన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై కమల్ హాసన్ కూడా ట్వీట్ చేసారు. ‘‘ఆ ముగ్గురి కుటుంబాలు పడుతున్న బాధకంటే నేను ఎక్కువగా చింతిస్తున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. గాయపడిన వారిని హాస్పిటల్‌ కు తరలించాం. నేను డాక్టర్లతో మాట్లాడి వెంటనే చికిత్స ప్రారంభించాల్సిందిగా కోరాను. వారంతా త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation