ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం పరిస్థితి విషమం డ్రంక్ అండ్ డ్రైవ్

కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ నియమాలు సామాన్యలుకు ఒకలాగా, శ్రీమంతులు, సెలబ్రిటీలకు ఒకలాగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి వాయువేగంగా కారు నడపడంతో ప్రముఖ కన్నడ నటి కారు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యింది. మద్యం సేవించి స్నేహితులతో కలిసి జాలీరైడ్ కు వెళ్లిన సమయంలో వేకువ జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ తో పాటు ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరు నగరంలోని ఫ్లైఓవర్ పిల్లర్ కు కారు ఢీకొనడంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

అపద్దాలు చెప్పిన హీరోయిన్
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి శనివారం అర్దరాత్రి స్నేహితులతో కలిసి జగ్వార్ కారులో జాలీరైడ్ వెళ్లారని తెలిసింది. జాలీరైడ్ వెళ్లిన హీరోయిన్ షర్మిల మండ్రే కారు శనివారం వేకువ జామున బెంగళూరు నగరంలోని వసంతనగర్ ఫ్లైఓవర్ కిందిభాగంలోని పిల్లర్ ను ఢీకొనింది.శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని వసంతనగర్ ఫ్లైఓవర్ పిల్లర్ ను నటి షర్మిల మండ్రే ప్రయాణిస్తున్న కారు ఢీకొనింది. కారు ప్రమాదం జరిగిన సమయంలో నటి షర్మిల మండ్రేతో సహ ఎవ్వరూ సీటు బెల్ట్ లు పెట్టుకొలేదని వెలుగు చూసింది.కారు ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్చునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో నటి షర్మిల మండ్రే ముఖంకు గాయాలైనాయి. కారు ముందు భాగం అద్దాలు పగిలిపోవడంతో ఆ గాజు ముక్కలు షర్మిల మండ్రే ముఖంలోకి చొచ్చుకుపోయాయి. ఈ ప్రమాదంలో షర్మిల మండ్రే శరీరంలో పలుచోట్ల గాయాలైనాయి.

ప్రమాదానికి కారణం అయిన కారును హీరోయిన్ షర్మిల మండ్రే స్నేహితుడు లోకేష్ నడుపుతున్నాడని తెలిసింది. ఈ ప్రమాదంలో షర్మిల మండ్రేతో పాటు లోకేష్ కు గాయాలు అయ్యాయి. షర్మిల మండ్రే స్నేహితుడు లోకేష్ రెండు చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి.కారు ప్రమాదం జరిగిన తరువాత హీరోయిన్ షర్మిల మండ్రే, ఆమె స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది. కారు ప్రమాదం జరిగిన తరువాత మొదట నటి షర్మిల మండ్రే, ఆమె స్నేహితులు బెంగళూరులో ప్రసిద్ది చెందిన వసంతనగర్ లోని విక్రమ్ ఆసుపత్రికి వెళ్లారు. తరువాత అక్కడ ఏం జరిగిందో ? ఏమో ? అక్కడి నుంచి నేరుగా ఫోర్టిస్ ఆసుపత్రికి వెళ్లారు. కారు ప్రమాదం జేపీ నగర్ లో జరిగిందని వైద్యులకు నటి షర్మిల మండ్రే, ఆమె స్నేహితులు అపద్దాలు చెప్పారు.

హీరోయిన్ కు తీవ్రగాయాలు

నటి షర్మిల మండ్రే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆ వాహనంలో నలుగురు ఉన్నారని వెలుగు చూసింది. కారులో ముందు సీటులో కుర్చోన్న నటి షర్మిల మండ్రేతో పాటు కారు నడుపుతున్న లోకేష్ కు తీవ్రగాయాలైనాయి. కారులో వెనుక సీటులో కుర్చొన్న మరో ఇద్దరికి చిన్నచిన్న గాయాలైనాయని సమాచారం.లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రముఖ నటి షర్మిల మండ్రే జాలీరైడ్ కు వెళ్లడం వివాదానికి దారితీసింది. మద్యం సేవించి అందరూ జాలీగా కారులో వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికే బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. వైద్య నివేదికలు వచ్చిన తరువాత నటి షర్మిల మండ్రేతో పాటు ఆమె స్నేహితులు మద్యం సేవించారా ? లేదా ? అనే విషయం తెలుస్తుందని హైగ్రౌండ్స్ పోలీసులు అంటున్నారు.

Content above bottom navigation