Breaking News : స్టార్ కమెడియన్ మృతి.. షాక్ లో సినీ ఇండస్ట్రీ

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు మూడు నెలల్లో ఎందరో సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఒకవైపు కరోనా విజృంభనతో ఇండస్ట్రీలు అల్లాడుతుంటే వరుస మరణాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణ‌వేణి సోమవారం నాడు మరణించగా. ఇప్పుడు మరొక స్టార్ కమిడియన్ అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Bullet Prakash Death News: Kannada comedian Bullet Prakash passes ...
తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాష్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఈయన గత నెల 31న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, కన్నడ, తమిళ్, తెలుగు మరియు ఇతర భాషల్లో 325 పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్‌ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. వైవిధ్యమైన శైలితో ఈయనకు ‘బుల్లెట్’ ప్రకాష్ అనే పేరు వచ్చింది. ‘మస్త్‌ మజా మాది’, ‘అయితలకడి’, ‘మల్లిఖార్జున’, ‘ఆర్యన్‌’ సినిమాలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. కన్నడ ‘ధృవ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రకాష్ శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, దర్శన్‌, ఉపేంద్ర, సుదీప్‌ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు.

బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ షో వలన కొన్ని వివాదాలలో కూడా ఇరుక్కున్నాడు. ఇంటిలోని కొందరి సభ్యులతో చాలా గొడవలు అయ్యాయి. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్ళీ అందరు స్నేహపూర్వంగానే మెలిగారు. ఇక ప్రకాశ్‌ బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. ఇక ప్రకాశ్ మృతికి పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. పలువురు నటులు ఆయనతో తమ అనుబంధాన్నిఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎవరు కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు సాయంత్రం బెంగుళూర్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Content above bottom navigation