శ్రీరెడ్డి అరెస్ట్ ? కేసు పెట్టిన కరాటే కళ్యాణి

106

ఎప్పుడూ కాంట్రవర్శియల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుండే నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్లు, పవన్ కళ్యాణ్‌పై విమర్శలు, నటులపై ఆరోపణలు ఇలా ఒకటేంటి అన్నిటి గురించి సోషల్ మీడియాలో పెట్టుస్తుంది ఆమె. తెలుగు సినిమా పరిశ్రమపై ఇక్కడి నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి చివరకు తమిళ సినిమాల్లో అవకాశాలు రావడంతో చెన్నైకి మకాం మార్చుకుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం తన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు కలకలం రేపుతున్నారు. తమిళ పరిశ్రమలో కూడా ప్రముఖ దర్శకులు ఏఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటులు రాఘవ లారెన్స్‌, శ్రీరామ్‌, హీరో విశాల్‌లపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆమెపై అనేకమంది పోలీసు కేసులు పెట్టారు. అయితే లేటెస్ట్‌గా శ్రీరెడ్డిపై ప్రముఖ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి.. కళ్యాణి గురించి మాట్లాడుతూ అసభ్యపదజాలంతో నోటికొచ్చినట్లు దూషించారు. కళ్యాణి ఇప్పటివరకు ముగ్గురు భర్తలను వదిలేసిందని, ఈ విషయాన్ని ఆమె మాజీ భర్తే తనకు చెప్పాడని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వల్గర్‌గా మాట్లాడినందుకు శ్రీరెడ్డిపై కేసు పెట్టింది కళ్యాణి. తనపై అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి మాట్లాడుతుందని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొంది. కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియా లైవ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని కరాటే కళ్యాణి కోరగా.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ విచారణ జరపి శ్రీరెడ్డిపై 67 ఐటీ యాక్ట్, 506, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రతిష్టను కించపరిచేలా కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం అని వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు.

Image may contain: 5 people, people standing

శ్రీరెడ్డి లాంటి వాళ్లు రాక్షస సంతతికి చెందినవారు. వాళ్ల గురించి మనం వదిలేద్దాం అనుకున్నాం. కానీ రాక్షస స్త్రీలకు మామూలుగా చెబితే అర్థంకాదు. నేను మంచి చెప్పాను. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. అది వాళ్లకు చెడుగా అర్థమైంది. ఇప్పుడు లైవ్‌లోకి ఎందుకు వచ్చానంటే.. చెప్పించుకోవాల్సిన పరిస్థితి వాళ్లే తెచ్చుకున్నారు. పిచ్చి ముదిరిన తర్వాత ట్రీట్‌మెంట్ చేయాలి. ఈ మధ్యకాలంలో శ్రీరాముడిని దూషించినవారు ఉన్నారు. వారిపై నేను పోరాటం చేసాను. దాంతో వాళ్లు నాపై కక్షతో శ్రీరెడ్డిని అడ్డుపెట్టుకుని ఆమె చేత నన్ను నోటికొచ్చినట్లు తిట్టించారు. చేయించినవాళ్లు బాగున్నారు. కానీ మధ్యలో శ్రీరెడ్డి ఇరుక్కుపోయింది. నేను అందరిలాంటి దాన్ని కాను. నేను మాటలు చెప్పను. చేతలతోనే చూపిస్తాను. శ్రీరెడ్డి తన అవసరం కోసం అడ్డదార్లు తొక్కింది. నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయ్. లీక్ చేసాను. కావాలంటే ఇప్పుడు కూడా లీక్ చేస్తాను. నేను ఆల్రెడీ శ్రీరెడ్డికి ప్రూఫ్స్ కూడా పంపించేసాను. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కాబట్టే డిబేట్లకు నేను వస్తున్నానని తెలిసి ఉచ్చపోసుకునేది. నన్ను తక్కువ చేయాలని చూసిన ప్రతీసారి ఆమే దిగజారిపోయింది. ఇప్పుడు మరింత దిగజారిపోతుంది. వల్గర్ భాష మాట్లాడకూడదు అని నేను ఇంటర్వ్యూలో చెబితే నన్ను అంత దారుణంగా మాట్లాడారు. శ్రీరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ కూడా అయిపోయింది. ఇక శ్రీరెడ్డిని ఎవరు కాపాడలేరు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో శ్రీరెడ్డికి తొందర్లోనే అర్థం అవుతుందని కరాటే కళ్యాణి చెప్పింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation