కృష్ణవంశీ – రమ్యకృష్ణ మిస్టరీ లవ్ స్టోరీ మీకు తెలుసా

నీలాంబ‌రిగా ర‌మ్య‌కృష్ణ‌ని చూస్తే ఆమె న‌ట‌న‌కి ఆస్కార్ ఇచ్చినా త‌క్కువే అని చెప్పాలి.అంద‌మైన న‌ట‌న ఆమె సొంతం.. అభిన‌యం ఆమెకు కిరీటం.సినిమాల్లో ఏ పాత్ర అయినా అవ‌లీల‌గా అందులో లీన‌మై చేయ‌డం ఆమెకు వెన్న‌తో పెట్టిన విద్య‌.బాహుబ‌లి సినిమాతో ఆమె ఫేమ్ ఎవ‌రూ అంద‌నంత ఎత్తుకి ఎదిగింది. రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా శివ‌గామిగామారిపోయారు ర‌మ్య‌కృష్ణ‌.బాహుబలి ఫేమ్ రమ్య కృష్ణ అనే ఇప్పుడు అంద‌రూ పిలుస్తున్నారు.. గ‌త చిత్రాల కంటే ఈ చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకువ‌చ్చింది.. ఎన్నో సినిమాల్లో నటించి అందరి మెప్పులను పొందారు. రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో తన అద్భుతమైన నటనతో అటు తమిళ, ఇటు తెలుగు రాష్ట్రాలలో అందరినీ కట్టిపడేసారు. మరి ఈ శివగామిని నిజజీవితంలో ఎవరు వరించారో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.. ఆ విష‌యాలు చూద్దాం.

Image result for krishna vamsi

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ర‌మ్య‌కృష్ణ‌ని వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.ఇద్ద‌రు కూడా తమ‌ ప్రేమ పెళ్లి విషయాల గురించి అంతగా పంచుకోరు. గతంలో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారు అని వార్తలు కూడా వచ్చాయి ..కానీ అవన్నీ అవాస్తవమని ఇద్దరు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి ప్రేమ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు.

Image result for krishnavamsi ramyakrishna

ఒకానొక సందర్భంలో రమ్యకృష్ణని తన ప్రేమ గురించి అడగగా ఆమె మాట్లాడుతూ…అది చాలా పెద్ద స్టోరీ. ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసాం. ఆపై పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం.. అప్పటినుండి తను నా బెస్ట్ ఫ్రెండ్ గా, మంచి భర్తగా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత (నా కొడుకు) రిత్విక్ మా జీవితంలోకి వచ్చాడు. నేను తెరపై కనిపిస్తే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాడు అని చెప్పారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇకపోతే కృష్ణవంశీ దర్శకుడిగా రాణిస్తే రమ్యకృష్ణ తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాలతో పాటు ప్రముఖ సీరియల్ లో నటించి ఇండియాలోనే ఒక గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరు ఎంత ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించినా… ఒకరి డబ్బును ఒకరు తమ స్వప్రయోజనాల కోసం వాడు కోరని, రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనా అందరికీ ఇష్టమైన రమ్యకృష్ణ తన వివాహ జీవితాన్ని ఎటువంటి గొడవలు లేకుండా కొనసాగించడం సంతోషపరిచే విషయమే. ఆమె అభిమానులు కూడా వీరి వివాహ బంధం బాగా ఉండాలని కోరుకుంటారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation