అల.. వైకుంఠపువైరములో చిక్కులు.. త్రివిక్రమ్‌ కి లీగల్ నోటీసులు

82

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్యే తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా ఎలాంటి విజయం అందుకుందో కూడా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులను అల వైకుంఠపురములో సినిమాతో తిరగరాసాడు ఈ దర్శకుడు. నెల రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు చిక్కులో పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఈ క్రింది వీడియోని చూడండి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీ అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. పలు రికార్డులు తిరగరాస్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే కూడా భేష్ అనిపించుకొని వరుస అవకాశాలు పట్టేస్తోంది. ఈ మూవీ కలెక్షన్స్ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. ఈ మూవీ కాపీ అంటూ ఆరోపణలు చేస్తున్నాడు ఓ యువకుడు. ‘అల.. వైకుంఠపువైరములో’ మూవీ కాపీ అంటూ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. వేరే డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌ని తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల.. వైకుంఠపువైరములో’ మూవీ రూపొందించారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విష‌యమై త్రివిక్ర‌మ్‌ కి స‌మ‌స్య‌లు వచ్చేలా క‌నిపిస్తున్నాయి.

Image result for trivikram allu arjun

చిన్న సినిమాలకు ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్న‌ కృష్ణ అనే ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌‌ పై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. తాను 2005లో త్రివిక్ర‌మ్‌ ని క‌లిసి ఇదే స్టోరీని నేరేట్ చేశానని, 2013లో ఈ క‌థ‌ని ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నానని అంటున్నాడు కృష్ణ. త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని త్రివిక్ర‌మ్‌ కి ఇచ్చాన‌ని కూడా ఆయన చెబుతున్నాడు. అంతేకాదు త‌న క‌థ‌తోనే త్రివిక్రమ్ ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ చిత్రాన్ని తెర‌కెక్కించాడ‌ని ఆరోపిస్తున్నాడు కృష్ణ‌. తాను ఈ క‌థతో దశ‌ – దిశ అనే టైటిల్‌ తో తెరకెక్కించాల‌ని భావిస్తే, త్రివిక్ర‌మ్ తన క‌థ‌తో ‘అల.. వైకుంఠ‌పుర‌ములో’ చిత్రం తెర‌కెక్కించాడ‌ని చెప్పాడు కృష్ణ. ఈ మేరకు త్రివిక్రమ్‌కి లీగ‌ల్ నోటీసులు కూడా పంపిస్తాన‌ని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కృష్ణ. దీంతో ఈ ఇష్యూ హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.

Image result for ala vykuntapuram trivikram

మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ఇలాంటి ఆరోపణలు బయటపడటం చిత్రయూనిట్‌ ని కలవరపెడుతోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత వెంటనే చెప్పకుండా నెల రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడు హైలైట్ చేస్తున్నావ్ అంటూ కృష్ణకు సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అది నీ కథ అవునా కాదా అని తెలుసుకోడానికి నెల రోజులు పట్టిందా.. రోజుకో సీన్ చూసి ఇది నీ కథ అని డిసైడ్ చేసుకున్నావా అంటూ ఈయన్ని త్రివిక్రమ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి పనులు చేస్తున్నావా అంటూ ఆడుకుంటున్నారు. కానీ కృష్ణ మాత్రం తన కథనే త్రివిక్రమ్ కాపీ చేసాడని చెబుతున్నాడు. మరి చూడాలిక.. ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో..?

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation