ఉరేసుకొని చనిపోయిన ప్రముఖ నటి…చివరి చూపుకు తరలివస్తున్న సినీ ఇండస్ట్రీ

154

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చిత్రసీమలో, టెలివిజన్ ఫీల్డ్‌లోనే కాదు అన్ని ఇండష్ట్రీలలోనూ బలన్మరణాలు ఆగడం లేదు. కుటుంబ కలహాలతో, అవకాశాలు రావడంలేదన్న కారణంతో, సెలబ్రిటీ స్థాయి నుంచి దిగజారి బ్రతకలేక పలువురు నటులు, వారి జీవిత భాగస్వాములు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరొక వర్ధమాన నటి ఆత్మహత్యకు పాల్పడింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు రాజధాని చెన్నై సిటీ సమీపంలోని తిరువత్తియూర్ లో పద్మజ (23) అనే యువతి నివాసం ఉంటోంది. పద్మజ అనేక తమిళ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించింది. నటి పద్మజ కొంతకాలం క్రితం పవన్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. చెన్నై సిటీ సమీపంలోని తిరువత్తియూర్ లో పద్మజ, పవన్ రాజ్ దంపతులు కొంతకాలంగా అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ కొడుకుని బంధువుల ఇంట్లో ఉంచి పెంచుతున్నారు. ప్రతి వారం బిడ్డను చూసుకోవడానికి వెళ్తుంటారు. ఇటీవల కాలంలో పద్మజకు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించే అవకాశాలు తగ్గిపోవడంతో పద్మజ కొంత ఆందోళనకు గురైయ్యింది.

అదే సమయంలో పద్మజ, పవన్ రాజ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నిత్యం ఇంటిలో పవన్ రాజ్, పద్మజ దంపతులు పదేపదే గొడవపడుతున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత పద్మజ, పవన్ రాజ్ ఇంటిలో గొడవపడ్డారు. గొడవ తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన పవన్ రాజ్ అర్దరాత్రి ఇంటిలో నుంచి ఆంద్రప్రదేశ్ లోని ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయాడు. తరువాత పద్మజ మాత్రమే ఇంటిలో ఉంది. పవన్ రాజ్ ఇంటికి రాకపోవడం, కనీసం ఫోన్ కూడా చెయ్యకపోవడంతో పద్మజ మరింత కుంగిపోయింది.

Image result for నటి పద్మజ ఆత్మహత్య

దాంతో పద్మ తన సోదరికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆర్ధిక కష్టాలు ఎక్కువయ్యాయని, సరైన పాత్రలు కూడా రావడం లేదని చెప్పుకొని వాపోయింది. నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పింది. అయితే ఆమె సోదరి ఏదో ఒకటి చెప్పి సముదాయించింది. ఆదివారం ఎంత సేపటికి పద్మజ, ఆమె భర్త పవన్ రాజ్ బయటకు రాకపోవడం, ఇంటి తలుపులు మూసివేసి ఉండటంతో ఆ ఇంటి యజమాని వెళ్లి చేశాడు. ఆ సమయంలో ఇంటి యజమాని పద్మజ నివాసం ఉంటున్న మెయిన్ డోర్ చిన్నగా లోపలికి నెట్టగా అవి తెరుచుకున్నాయి. ఇంటిలో పద్మజ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడంతో ఇంటి యజమాని షాక్ కు గురై పోలీసులకు, ఆమె భర్త పవన్ రాజ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పద్మ ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఆమె అప్పటికే చనిపోయి ఉంది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. అప్పుల బాధలు, భర్తతో గొడవలే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ నటి బోరున విలపిస్తూ తీసిన వీడియోలను బెంగళూరులోని అక్కకు పంపించడం కలకలం రేపింది. భర్త వేదింపుల కారణంగా నటి పద్మజ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు పవన్ రాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో నటిస్తున్న నటి పద్మజ ఆత్మహత్య చేసుకోవడంతో తమిళ సినీరంగ ప్రముఖులు షాక్ కు గురవుతున్నారు.

Content above bottom navigation