Breaking News : హీరోయిన్ శ్రియ భర్తకి కరోనా..!

చైనా దేశంలో పుట్టిన వైరస్ చాలా వేగంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే 182 దేశాలకు పైగా వైరస్ కేసులు నమోదు కావడంతో ప్రపంచ జనాభా అంతా జంకుతున్నారు. ఈ వైరస్ కు నువ్వు నేను.. చిన్నోడు పెద్దోడు.. పేదోడు ధనికుడు అనే తేడా తెలియదు. అందరికీ సోకడమే.. సోకిన వాళ్లు సరైన వైద్యం తీసుకోకపోతే పైకి వెళ్లడమే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కొందరు సెలబ్రిటీలకు కూడా ఇది సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌ లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా వైరస్ బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్‌ శ్రియ భర్తకు వైరస్ లక్షణాలు ఉన్నాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

న‌టి శ్రియ భ‌ర్త‌కి క‌రోనా..!

ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌ల‌లో ఒక‌రిగా ఉన్న శ్రియ 2018లో బార్సిలోనా టెన్నిస్‌ ప్లేయర్‌ అండ్రీ కొచ్చిన్‌ ని వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్న ఈ అమ్మ‌డు గ‌త కొద్ది రోజులుగా స్పెయిన్‌ లోని బార్సిలోనాలో ఉంటుంది. ప్ర‌స్తుతం అక్క‌డ వైరస్ విల‌య‌తాండవం చేస్తున్న‌ప్ప‌టికీ, శ్రియ ఇంట్లో త‌న భ‌ర్త‌తో క‌లిసి అనేక వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది. అయితే శ్రియా భ‌ర్త ఆండ్రి వైరస్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. ఆండ్రీకి పొడి ద‌గ్గు, జ్వ‌రం ఉన్నాయి. వైర‌స్‌ కి సంబంధించిన భ‌యంక‌ర‌మైన ల‌క్ష‌ణాలు రెండు ఉండ‌డంతో వెంట‌నే ఆండ్రీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య సిబ్బంది చికిత్స‌లు చేసి కొద్ది రోజుల పాటు ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దేవుడి ద‌య వ‌ల‌న అత‌ను ఇప్పుడు బాగానే ఉన్నాడు అని శ్రియ పేర్కొంది.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

ఇక ఇంట్లోనే ఉంటున్న శ్రియ దంపతులు గమ్మతైనా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రియ, ఆండ్రీలు సెటైరికల్ సైన్ బోర్డులతో సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సామాజిక దూరం పాటించండి అని శ్రియ సైన్ బోర్డు చూపించింది. ఆమె నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుందనే బోర్టును ఆండ్రీ చూపించాడు. ఆ తర్వాత విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శ్రియ బోర్డు చూపించగా, తనతో రోజంతా పని చేయిస్తోందనే బోర్డును ఆమె భర్త చూపించాడు. అనంతరం ఇంటి వద్దే ఉండండి అనే బోర్డును శ్రియ చూపించగా, ఆమె నుంచి నన్ను కాపాడండి అని ఆండ్రీ సైన్ బోర్డును చూపించాడు. ఈ విధంగా వీరిద్దరూ అభిమానులను అలరించారు.

Content above bottom navigation