తన లవర్ గురుంచి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్ ప్రదీప్

122

యాంకర్‌గా చేస్తూనే వెండితెరపై హీరోగా రాణించేందుకు రెడీ అయ్యాడు యాంకర్ ప్రదీప్. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌‌లో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్, పెళ్లి గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రదీప్. ప్రదీప్ చెప్పిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for anchor pradeep

తెలుగు బుల్లితెరపై ఫిమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ ఉందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు కూడా అంతే క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన వాక్ చాతుర్యంతో లేడీస్ హవా ఉన్న యాంకరింగ్ రంగంలో నెంబర్ 1 మేల్ యాంకర్ గా రాణిస్తున్నాడు ప్రదీప్. ఢీ,కొంచెం టచ్ లో ఉంటె చెప్తా, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి షోలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన కెరీర్ లో మరొక ఎత్తుకు ఎదగబోతున్నాడు. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాతో హీరోగా మారబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ చూడగానే యూత్ అంతా ఆకర్షితులయ్యారు. పైగా ప్రదీప్ లాంటి పంచ్ మాస్టర్ హీరో కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇంతలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్, సాంగ్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఈ మూవీ డిమాండ్ అంతకంతకూ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మర్చి 25న విడుదల కానున్న నేపథ్యంలో ప్రదీప్ సహా హీరోయిన్, దర్శకనిర్మాతలు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా కమిడియన్ అలీతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రదీప్ తన మొదటి లవర్ ఎవరో చెప్పి ఆశ్చర్యపరిచాడు. మీ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరు? ఫస్ట్ లవ్ మ్యాటర్ ఏమైనా ఉందా? అని అడగ్గానే సోనాలి బింద్రే అని సమాధానిచ్చాడు ప్రదీప్. దానికి అలీ ఆమె అంటే నాకూ ఇష్టమే కానీ రియల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు చెప్పు అని ప్రదీప్‌ ని ఫోర్స్ చేశాడు.

Image result for pradeep

అప్పుడు విషయం బయటపెట్టిన ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫస్ట్ లవర్ పేరు చెప్పే ఉద్దేశ్యం లేదని.. ఎందుకంటే ఈ పాటికి ఆమెకి పెళ్లయిపోయి ఉంటుందని, ఇప్పుడు పిల్లలతో కలిసి ఈ షో చూస్తూ ఉందేమో అని అన్నాడు ప్రదీప్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రదీప్ చెప్పిన ఈ లవ్ మ్యాటర్ జనాలకు ఆసక్తి కలిగిస్తోంది. ఈ మేరకు తన పెళ్లి గురించి కూడా స్పందించిన ప్రదీప్.. బహుశా వచ్చే ఏడాది తన పెళ్లి ఉండొచ్చనే కోణంలో మాట్లాడాడు. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాన్ని చేసుకుంటానని చెబుతూనే.. పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలైతే ఉండవని చెప్పాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation