రూ.41లక్షలు మోసం… పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన పటాస్ రవి…

యాంకర్ రవి…పరిచయం అక్కర్లేని పేరు.తనదైన పద్దతిలో యాంకరింగ్ చేస్తూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. పటాస్ షో బాగా అలరించిన ఈయన ఈమధ్యనే ఆ షోకు గుడ్ బై చెప్పాడు. వేరే ఛానల్స్ లలో కొన్ని ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే రవి అప్పుడప్పుడు కొన్ని వివాదాలలో కూడా ఇరుక్కుంటాడు. ఆ మధ్య అమ్మాయిల మీద చలపతి రావు చేసిన వ్యాఖ్యల విషయంలో గానీ, యాంకర్ లాస్య విషయంలో..ఇలా చెప్పుకుంటూపోతే చాలా విషయాలలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Image result for patas ravi

సందీప్ అనే వ్యక్తి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకుని సందీప్ మోసం చేశాడంటూ యాంకర్ రవి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ఆ సందీప్ అనే వ్యక్తి 2018 అక్టోబర్‌లో పటాస్ రవి మీద ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సందీప్‌ తో యాంకర్ రవికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి. తీసుకున్న బాకీని సందీప్ చెల్లించకపోవడంతో 20 మంది అనుచరులతో కలిసి కమలాపురికాలనీలోని సందీప్ కార్యాలయంలో చొరబడి రవి బీభత్సం సృష్టించారు. దీంతో అప్పట్లో సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవి వద్ద తీసుకున్న రూ.15 లక్షలను తిరిగి చెల్లించకపోతే తన అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడని సందీప్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణానికి ముప్పు ఉందని, యాంకర్ రవి నుంచి రక్షణ కల్పించాలని సందీప్ పోలీసులను వేడుకున్నాడు. దీంతో రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కూడా చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక అప్పటినుంచి కూడా ఈ ఇద్దరి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. యాంకర్ రవి హీరోగా నటించిన ఇది మా ప్రేమ కథ సినిమాకు సందీప్ డిస్ట్రిబ్యూటర్. అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే, అప్పట్లో గుడ్ విల్ కింద డబ్బులు ఇచ్చిన రవి.. మళ్లీ ఆ డబ్బులు తిరిగివ్వాలని బెదిరిస్తున్నాడంటూ సందీప్ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఇప్పుడు రవి… తనకు సందీప్ రూ.41లక్షలు మోసం చేశాడంటూ కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. చూడాలి మరి ఇప్పటికైనా పోలీసులు రవికి న్యాయం చేస్తారో లేదో..

ఈ క్రింది వీడియోని చూడండి \

Content above bottom navigation