మళ్లీ ప్రేమలో పడ్డ శ్రీముఖి.. ఎవరో తెలిస్తే షాక్ ..

188

శ్రీముఖి..బుల్లితెర ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. టీవీ యాంకర్లు సుమ, ఝాన్సీ, అనసూయ,రేష్మి తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు టీవీ షోలలో అందం, హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నమరో యాంకర్ శ్రీముఖి. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని….తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. తెలుగులో యాంక‌ర్స్ చాలా మంది ఉన్నా శ్రీముఖి రూటే స‌ప‌రేటు. చాలా చలాకీగా ఉంటుంది శ్రీముఖి. .యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖి తక్కువ సమయంలోనే టాప్ రేంజ్‌కి చేరుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకొంది.

ఈ క్రింది వీడియో చూడండి

బుల్లితెర రాములమ్మగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ షోతోనూ అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విజేతగా నిలవాల్సిన శ్రీముఖి, ఆమె చేసిన స్వయం తప్పిదాలతో రన్నర్‌ గానే మిగిలిపోయింది. బిగ్‌బాస్ షో కంటే ముందు క్షణం తీరిక లేకుండా గడిపే శ్రీముఖికి, షో తర్వాత ఆఫర్స్ అంతగా రావడం లేదు. స్టార్ మ్యూజిక్ అనే ఓ ప్రోగ్రామ్ తప్పా మరో కొత్త షోను చేయలేదు. బిగ్‌బాస్ షో వల్ల అభిమాన గణం అయితే పెరిగింది కానీ, అదే రేంజ్‌లో ఇమేజ్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్ బయటకు వచ్చేశాయి.

Image result for srimukhi

సెలెబ్రిటీలందరూ తమ అభిమానులతో ముచ్చటించేందుక లైవ్‌లోకి వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీముఖికి కూడా లైవ్‌ లోకి వచ్చి తన ఫ్యాన్స్‌ తో ముచ్చటించింది. ఇక నెటిజన్స్ తమకు ఇష్టం వచ్చిన ప్రశ్నలను సంధించారు. అందులో కొన్నింటికి శ్రీముఖి జవాబులు ఇచ్చింది. స్నేహితుడి నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని, పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలాగే అనుమతి లేకుండా పక్కవారి ఫోన్ చూడాల్సి వచ్చిందని, అది చాలా చెడ్డ అలవాటని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇక శ్రీముఖికి ఎదురైన ఈ ప్రశ్నల పరంపరలో ప్రేమ, పెళ్లికి సంబంధించినవీ ఉన్నాయి. మీరు ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అవును అంటూ సమాధానం చెప్పింది శ్రీముఖి. `ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా? అని కూడా ప్రశ్నించారు. దానికి ఏమాత్రం తడబడకుండా.. అవును వద్దన్నానంటూ జవాబిచ్చింది. అయితే అదెవరన్న విషయం మాత్రం చెప్పలేదు. శ్రీముఖి ఇలా తన ప్రేమ గురించి చెప్పడంతో ఎవరో ఆ అదృష్టవంతుడు చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Content above bottom navigation