అసలే ఇది లాక్ డౌన్ సమయం. ఎవరూ ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో తమకు కావాల్సిన వారు చనిపోతే ఇక ఆ బాధ వర్ణనాతీతమే. ఇప్పుడు ప్రముఖ తెలుగు యాంకర్ సుమా దంపతులకు కూడా ఇధే పరిస్తితి నెలకొంది. యాంకర్ సుమ కనకాల ఇంట్లో మరొక విషాదం చోటుచేసుకుంది. గత యేడాది ఆగష్టులో రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల కన్నుమూసారు. అంతకు రెండేళ్ల క్రితం దేవదాసు కనకాల భార్య లక్ష్మీ కనకాల మృతి చెందారు. తాజాగా రాజీవ్ కనకాల కుటుంబంలో ఆమె సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందింది. ప్రముఖ నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి. ఆమె కూడా అనేక టీవీ సీరియల్స్‌లో నటించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉండడం వల్ల నటనకు ఆమె దూరంగా ఉన్నారు. శ్రీలక్ష్మి సోదరుడు రాజీవ్ కనకాల. శ్రీ లక్ష్మి భర్త సీనియర్ జర్నలిస్టు పెద్ది రామారావు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. శ్రీ లక్ష్మి కొధ్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతుడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిసేపటి క్రితమే శ్రీలక్ష్మి మరణించారు. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే… శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు. సుమకు, రాజీవ్ కు మద్య ప్రేమ కహానీ జరిగినప్పుడు శ్రీలక్ష్మీనే మద్యవర్తిత్వం వహించిందంట. అడపాదడపా పలు సీరియల్స్‌లో నటించిన శ్రీలక్ష్మీ నటిగా రాణించలేకపోయారు. ఆమె మరణంతో రాజీవ్ కనకాల విషాదంలో మునిగిపోయారు. శ్మీలక్ష్మీ మరణవార్త తెలియగానే పలువురు సినీ, టీవీ రంగాలకు చెందినవారు సంతాపం తెలియచేస్తున్నారు.
వరుసగా కనకాల కుటుంబంలో మూడో మరణం చోటు చేసుకోవడం కాస్త విషాదకరం అనే చెప్పాలి. లక్ష్మీదేవి కనకాల మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవిత రాజశేఖర్ లు ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటం కారణంగా ఎవరు కూడా వారి ఇంటికి వెళ్ళి పరామర్శించలేని పరిస్తితి నెలకొంది. ఫోన్ చేసి సుమను, రాజీవ్ ను పరమర్శిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా పరమర్శిస్తున్నారు.