దిల్ రాజుతో అనుష్క పెళ్లి.. బొమ్మాలి అదిరిపోయే రియాక్షన్ ..

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు తిరుగులేని ఇమేజ్ ఉంది. నిర్మాతగా ఆయన విజయాలకు పెట్టింది పేరు. రాజుగారి బ్యానర్ నుంచి సినిమా వచ్చిందంటే చాలు.. విజయం అనేది ఇంటి ముందు నిల్చుంటుందనే నమ్మకం ఉంది. ఈ మధ్యే జానుతో వచ్చాడు ఈయన. ఈ నిర్మాత ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. దిల్ రాజు రెండో పెళ్లి వార్త ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రాజుగారి భార్య అనిత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కొన్నాళ్లు ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయాడు. తన వెంకటేశ్వర బ్యానర్ సినిమాల్లో తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు దిల్ రాజు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. భార్య చనిపోయిన తర్వాత రాజు ఒంటరి అయిపోయాడు. దాంతో ఈయనకు తోడు కావాలని.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో రాజు కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Image result for anushka and dil raju

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా దిల్ రాజు రెండో పెళ్లి గురించే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన తనకు తెలిసిన అమ్మాయి మరో పెళ్లి చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆయన సన్నిహితులు మాత్రం ఇది నిజమే అని చెబుతున్నారు. త్వరలోనే దిల్ రాజు మరోసారి ఇంటివాడు కాబోతున్నాడు. ముఖ్యంగా ఈయన పెళ్లి గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈయన పెళ్లి చేసుకోబోయేది హీరోయిన్ అనుష్కను అంటూ కొంతమంది పుకార్లు పుట్టించారు. అనుష్క దిల్ రాజుతో పెళ్ళికి ఒప్పుకుందని, కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. దాంతో ఈ విషయం మీద అనుష్క గట్టిగానే రిప్లై ఇచ్చింది. నా పెళ్లి గురించి బయట వస్తున్నా వార్తలన్నీ నిజం కాదు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాల మీదనే ఉంది. నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అది మా తల్లిదండ్రులు నిర్ణయించేదే. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. ఇటువంటి వార్తలు మనసుకు చాలా బాధ కలిగిస్తాయి. మరోసారి చెబుతున్నా నేను అరేంజ్డ్ మ్యారేజ్ నే చేసుకుంటా. ఇకనైనా ఇలాంటి వార్తలు, పుకార్లు పుట్టించడం ఆపేస్తే మంచిది..” అంటూ కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది జేజమ్మ.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ మధ్య నాని నిర్మించిన హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అనుష్క అక్కడ తన పెళ్లి గురించి మరోసారి మనసులో మాట బయట పెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమె నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇందులో అంజలి, మాధవన్, శాలిని పాండే ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలు అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. ప్రస్తుతానికి ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. అయినా అనుష్క ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది. నిశ్శబ్దం తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాను అని చెప్పింది అనుష్క. ఇంకొకసారి ఇంత పెద్ద బ్రేక్ రానివ్వవు అని వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation