మంచోడు అనుకున్నాం కానీ ఇంత పెద్ద నీచుడా.. ఛీ ఛీ ..

226

మంచోడు మోసగాడుగా మారాడు.. అలాంటి ఇలాంటి మోసగాడు కాదు.. ఒక అమ్మాయిని ప్రేమించిన ట్టుగా నటించి.. ఆమెను లొంగదీసుకుని పెళ్లి చేసుకుని.. తీరా అదే ఇంట్లోనే మరో ఆమెతో శృంగారక్రీడలో మునిగితేలుతూ పాత సినిమాల్లో విలన్లను తలపిస్తున్నాడు. ఆ మంచోడు ఎవరో కాదు. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ. బిగ్ బాస్ సీజన్ 3లో మంచోడిగా అందరి మన్ననలు అందుకున్న రవికృష్ణ మంచోడు కాదంట. అయితే అది రియల్ లైఫ్ లో కాదులెండి. రీల్ లైఫ్ లో. ‘ఆమె కథ’ సీరియల్‌‌ తో చెడ్డోడిగా మారాడు. ఓ నెగిటివ్ క్యారెక్టర్ వేసెయ్ అని మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ ఫైనల్‌లో చెప్పిన మాటను తూచా తప్పకుండా నెగిటివ్ పాత్రలో ఒదిగిపోయాడు.

మొగలిరేకులు సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయిన రవి కృష్ణ.. వరూధిని పరిణయంలో హీరోగా చేసి.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌ బాస్‌ షోలో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అయితే.. ఇప్పటివరకూ పాజిటివ్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే చేసిన రవి కృష్ణ… మొదటి సారి నెగటివ్‌ క్యారెక్టర్‌‌తో బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవి ‘ ఆమె కథ ‘ సీరియల్ లో నటిస్తున్నాడు. ఆ సీరియల్ లో మొదటి నుంచి మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు చెడ్డోడిగా మారిపోయాడు. ఇన్నాళ్లు ఎంతో మంచిగా ఉన్న రవి, బిడ్డ పుట్టగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఇన్నాళ్లు వారి వంశానికి ఒక వారసుడు కావాలి అని భార్య పద్మిని వద్ద నటించిన రవి, ఒక్కసారిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. పాపం, భార్య ఎంతో కష్టపడి బిడ్డకు జన్మనిస్తే, ఆరోగ్యం ఎలా ఉంది.. బాగుందా అని కూడా అడగడు ఈ రవి.

Image result for big boss ravi

అంతే కాదు, ఆమె మాట్లాడితేనే చిరాకు పడుతాడు. ఆమె ముందే పనిమనిషిని పొగుడుతాడు అంటే నమ్మండి. పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా పెళ్లి చేసుకున్న సొంత భార్యను పని అయిపోగానే చీడ పురుగును చూసినట్టు చూస్తున్నాడు.. ఆ సీరియల్ లో హీరోయిన్ కి వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు అనేంతలా ఆ సీరియల్ ఉంది. మంచోడు మరి ఇంత పెద్ద నీచుడు అని అనుకోలేదు అని చుసిన ప్రేక్షకులు చెప్తున్నారు. అయితే ఈ ” ఆమె కథ ” సీరియల్ ప్రారంభమై మూడు నెలలు అయిపోయిన, సీరియల్ కథ ఏంటి అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. కారణం అది చాలా మిస్టరీ కథల. సీక్రెట్ గది అంటూ, వారసుడు అంటూ, అది ఇది అని సీరియల్ కథ అంత డిఫరెంట్ గా ఉంది. మరి ఇప్పుడు వారసుడు కూడా పుట్టాడు. రానున్న రోజుల్లో కథ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation