సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత..

కరోన కష్టకాలంలో మరో విషాదం బాలీవుడ్‌ ఇండస్ట్రీని కమ్మేసింది.  ప్రముఖ సినీ నటి, స్టేజ్‌ ఆర్టిస్ట్‌ ఉషా గంగూలి గుండెపోటుతో కన్నుమూశారు. దక్షిణ కోల్‌కతాలోని లేక్ గార్డేన్స్ ఏరియాలోని తన ఫ్లాట్‌లో ఆమె తుది శ్వాస విడిచారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆమెను వెంటనే దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.

కళారంగానికి విశేష సేవలందించిన ఉషా మృతికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లెజెండరీ నటులు షబానా ఆజ్మీ, అపర్ణాసేన్ సంతాపం తెలిపారు.

నటి ఉషా గంగూలీ వయసు 75 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌కు కుటుంబానికి చెందిన ఆమె జోధ్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్‌కతాకు మకాం మార్చారు. 1976లో రంగ కర్మీ అనే గ్రూపులో చేరడం ద్వారా నాటక రంగంలోకి ప్రవేశించారు. మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి పేరొందని నాటకాల్లో కీలక పాత్రను పోషించారు.

బెంగాల్‌లో హిందీ థియేటర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టు అత్యంత ప్రేక్షకాదరణ కూడగట్టారు. స్వయంగా ముఖ్తి, మానసి లాంటి సొంత ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించారు. అజయ్ దేవగన్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ చిత్రానికి దర్శకురాలు రితుపర్ణో ఘోష‌తో కలిసి కథా సహకారం అందించారు. గుడియా ఘర్ నాటకంలో ఆమె దర్శకత్వ శాఖలో ప్రతిభకుగాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెకు సంగీత నాటక అకాడమీ అవార్డును ఇచ్చింది.

ఉషా గంగూలీ మరణవార్తను తెలుసుకొన్న సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. నాటక రంగానికి తీరని లోటు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులకు మమతాబెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటి అపర్ణాసేన్ స్పందిస్తూ ఇకలేరని వార్తను నమ్మలేకపోతున్నాను అని అన్నారు. నాటక రంగానికి దిక్సూచిలా నిలిచిన ఉషా గంగూలీ మరణవార్తను విని తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాను. ఆమెతో కలిసి పార్, ఇతర ప్రొడక్షన్లలో కలిసి పనిచేశాను. నాటక రంగంలో ఆమెకు ఆమే సాటి. ఏ లోకంలో ఉన్నప్పటికీ ఆమె శాంతి చేకూరాలి అని షబానా ఆజ్మీ ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

Content above bottom navigation