సినీనటి పిజ్జా ఆర్డర్ చేసిన పాపానికి..పోర్న్ సైట్ లో హీరోయిన్ ఫోన్ నెంబర్

212

ప్రముఖ సినీ నటికి చుక్కలు చూపించాడో పిజ్జా డెలివరీ బాయ్. ఆమె ఫోన్ నంబర్‌ను అడల్ట్స్ గ్రూప్‌లో షేర్ చేయడంతో ఆమెకి నిత్యం అవే ఫోన్‌కాల్స్. తన నంబర్ బీ గ్రేడెడ్ గ్రూప్స్‌లో షేర్ అయిన విషయం తెలుసుకున్న సదరు నటి పోలీసులను ఆశ్రయించింది. తన నంబర్ అసభ్యకర గ్రూప్‌లలో పోస్ట్ చేసి తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది.చెన్నైలో నివాసం ఉంటున్న తమిళ సినీ నటి గాయత్రి సాయి డోమినోస్‌ నుంచి పిజ్జా ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్‌ పిజ్జా తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో ఆమె ఫోన్ నంబర్ తెలుసుకున్న డెలివరీ బాయ్.. గాయత్రి ఫోన్ నంబర్‌ను అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడు. అప్పటి నుంచి ఆమెకి నీచమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. అసభ్యకరంగా వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయని గాయత్రి వాపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి


ఫోన్ కాల్స్‌తో విసుగెత్తిన ఆమె.. పిజ్జా డెలివరీ బాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోన్ నంబర్‌ను అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడని.. దీంతో విపరీతమైన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. తనకు సాయం చేయాలని కోరారు. వాట్సాప్‌ మెసేజ్‌లను స్క్రీన్ షాట్‌‌లు తీసి ఆమె ట్విటర్‌లో కూడా ఉంచారు. వాటితో పాటు పిజ్జా డెలివరీ బాయ్‌ ఫొటోను కూడా ఆమె షేర్‌ చేశారు.నటి గాయత్రి ఫిర్యాదు మేరకు తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. గాయత్రి సాయి… ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation