breakingnews : ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్.. హాస్పిటల్ కు తరలింపు

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ సింగర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

Image result for కనికా కపూర్‌కు
హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ నందిని రాయ్

ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌కు కరోనా సోకినట్లు తెలిసింది. ఈ విషయం డాక్టర్లు వెల్లడించారు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ పాటలు పాడిన ఈమె బేబి డాల్‌, చిట్టియాన్‌ కలైయాన్‌ లాంటి పాటలతో మరింత ప్రాచూర్యం పొందింది. కొన్ని రోజులుగా లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు వచ్చింది. లక్నో చేరుకున్న తర్వాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. దానికి చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సామాజిక వేత్తలు కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత లక్నోలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో వాళ్లున్నారు.

ఇప్పుడు చూసుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా ఆ పార్టీకి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు అధికారులు వెల్లడించారు. అందులో గాయని కనికా ఒకరు. ప్రస్తుతం ​లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు. కాగా లండన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత కనికా తన ప్రయాణం గురించి ఎవరికి చెప్పకపోవడం గమనార్హం. కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆమె కుటుంబసభ్యులను, ఆమె ఇంట్లోని పనిమనిషిని కూడా ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Image result for సింగర్‌ కనికా కపూర్‌

మరోవైపు కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మ కరోనావైరస్ బారిన పడింది. అలాగే గేమ్ ఆఫ్ త్రోన్‌ లోనే నటించిన మరో నటుడు క్రిస్టోఫర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని క్రిస్టోఫర్‌ తెలిపారు. అలాగే హాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్‌, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓల్గా కురేలేంకో కూడా చేరింది. ఇక ఈ లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. లాస్ట్ వీక్ కరోనాతో బాధపడుతూ యూనివర్సల్‌ మ్యూజిక్‌ అధినేత, సీఈవో లుసియన్‌ గ్రినేజ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇలా చాలామంది ప్రముఖులు కరోనా మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.

Content above bottom navigation