హైపర్ ఆది ఆత్మహత్య.. షాక్ లో జబర్దస్త్ యూనిట్..

వారానికి ఒకసారి వచ్చి మళ్ళి వచ్చేవారం ఎప్పుడొస్తుందా నాయి ప్రేక్షకుడు ఎదురుచూసేలా చేసే పోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ అనే చెప్పుకోవాలి. జబర్దస్త్ లో వచ్చే కామెడీ కోసం ప్రేక్షకుల ఎంతలా వెయిట్ చేస్తారో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్కొక్కరి స్కిట్ ఒక్కొక అద్భుతంగా ఉంటుంది. అయితే ఉన్న వారిలో అందరి కన్నా జనాలను ఎక్కువగా ఆకట్టుకునేది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. ఈమధ్య ఆది తన స్కిట్ లలో గెస్ట్ లను తీసుకొస్తున్నాడు. ఇక ఆది స్కిట్ మొదలైందంటే పొట్ట చెక్కలు అయిపోతున్నా, వరస పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. వచ్చే వారం వచ్చే షోలో కూడా అదే జరగనుంది. అయితే ప్రతిసారి ఆ తాడు ఈ తాడు పట్టుకుని హీరోలా ఎంట్రీ ఇచ్చే ఆది, ఈ సారి ఉరితాడు పట్టుకుని కామెడీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు.

ప్రోమో స్టార్ కావడమే.. అటు ఇద్దరు ఆడవాళ్లు, ఇటు ఇద్దరు మగవాళ్ల మధ్యలో హైపర్ ఆది ఉంటారు. అంతా ఉరి వేసుకోవాడానికి సిద్ధంగా ఉంటారు. ఆదిని, ‘ఏమండీ మీరూ చచ్చిపోదామనే వచ్చారా?’ అని అడుగుతాడు. వెంటనే ఆది.. ‘లేదురా.. ఈ తాడు మెడలో వేసుకుని మేఘాలలో తేలిపోమన్నది అని పాట పాడటానికి వచ్చానురా’ అంటాడు. దాంతో హైపర్ నవ్వులు స్టార్ట్ అవుతాయి. ‘బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్లం సార్..’ అన్న మరో ఆర్టిస్ట్ మాటలకు ఆది స్పందిస్తూ.. ‘డెంగ్యూ వైరస్‌ ని మింగలేదు కానీ కరోనా వైరస్‌తో కరాటీ చేస్తానన్నాడట నీలాంటోడు’ అంటూ పంచ్ వేస్తాడు. ఇంతలో లేడీ గెటప్‌ లో ఉన్న శాంతి స్వరూప్, ‘మేము చచ్చిపోతే రేపు పేపర్‌లో ఆత్మహత్యలు చేసుకున్న అందగత్తెలు అనేగా వస్తుంది?’ అంటుంది. వెంటనే ఆది ‘అలా రాదండీ. ఆత్మహత్య చేసుకున్న జంట. ఆడోమగో తెలీదంట’ అంటూ ఆది పంచ్ వెయ్యడంతో జడ్జ్ రోజా పడిపడి నవ్వుతారు.

Image result for hyper adhi

‘భగవంతుడా.. ఈ అందం అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా? అని అంటుంది శాంతి. వెంటనే ఆది.. ‘దేవుడా ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసి కొడతా’ అంటూ పంచ్ వేస్తాడు. మళ్లీ ఆది మాట్లాడుతూ.. ‘నాతో మామూలుగా ఉండదు.. రెండు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చా’ అంటాడు. ‘రెండు సంవత్సరాలా? ఎందుకెళ్లొచ్చారండీ?’ అని అడుగుతాడు రాజు. ‘భోగి మంట వేశానని జైల్‌ కి పంపించారు’ అని సమాధానం ఇస్తాడు ఆది. ‘ఏంటీ.. భోగి మంట వేస్తేనే జైల్‌కి పంపేస్తారా?’ అంటాడు ఆశ్చర్యంగా రాజు. ‘రైలు బోగి మంటరా.. పంపించరా? అని ఆది చెప్పడంతో జబర్దస్త్ నవ్వులు ఊపందుకున్నాయి. ఇంతలో ‘జీవితమంటే ఓ సవారీ.. మంచానికి ఉంటుంది నవ్వారి..’ అంటూ పిచ్చి కవిత్వంతో ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి వచ్చిన వ్యక్తికి కూడా పంచ్‌లు వేశాడు ఆది. ‘అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు ఎన్‌డీ తివారీ… నేనిక్కడ తంతే.. నువ్వు పరారీ’ అంటూ పంచు వేసి నవ్విస్తాడు. రాజుని ఓ అమ్మాయి ‘వీడి ముఖానికి టూ వీలర్ బండైనా ఉందా?’ అంటూ తిడుతుంటే.. ‘వీడికి ఫోర్ వీలర్ బండి ఉంది తెలుసా’ అంటూనే.. ‘ఏరా చెప్పలేదా? ఆంబులెన్స్ ఉందని చెప్పలేదా?’ అంటూ పంచు వేస్తాడు ఆది. మొత్తానికీ నెక్ట్స్ వారం రాబోతున్న షోలో ఆది స్కిట్ దుమ్మురేపనుంది.

Content above bottom navigation