జబర్ధస్త్ లోకి దొరబాబు రీ ఎంట్రీ.. కానీ ఒక కండిషన్..

104

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువగా పాపులర్ అయ్యే స్కిట్ ఏదైనా ఉందంటే అది హైపర్ ఆది స్కిట్ అనే చెప్పుకోవాలి. హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే కామెడీ పంచ్ లు పేలిపోతాయి.. పొట్ట చెక్కలు కావాల్సిందే అంటారు. గత కొంత కాలంగా ఆయన కొంత మంది నటులను అనుకరిస్తూ కామెడీ చేస్తున్నాడు. హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు లకు మంచి స్థానం ఉందన్న విషయం తెలిసిందే.. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Image result for dorababu

ఈ ఘటన జరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ కమెడియన్ హాట్ టాపిక్ గా మారాడు. ఈ ఘటనపై జబర్దస్త్ యూనిట్ లో ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకదశలో జబర్ధస్త్ నుంచి దొరబాబు ని తీసేశారు అన్న వార్తలు కూడా వచ్చాయి. దొరబాబు నిజంగానే వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డాడా.. లేదా.. కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరకించారని మరికొందరు వాదిస్తున్నారు. దొరబాబు భార్య మాత్రం దొరబాబు ఏంటో నాకు తెలుసు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్త తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నా.. ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా, నా మనసాక్షి నమ్ముతుంది అని ఆమె వివరించింది. దాంతో ఇప్పుడు ఈ టాపిక్ వేరే రకంగా మారింది.

Image result for hyper aadi dorababu

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

తాజాగా జరిగిన సంఘటనతో మల్లెమాల టీమ్ దొరబాబును బ్లాక్ లిస్ట్‌ లో పెట్టినట్టు సమాచారం. అతనిని జబర్దస్త్ నుంచి తీసేయాలని ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. కానీ హైపర్ ఆది కలగజేసుకొని మల్లెమాల టీమ్‌ తో మాట్లాడి, మళ్ళీ దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం. ఎప్పటి నుంచో టీమ్ లో కొనసాగుతున్నాడని, ఆడియన్స్ కొత్తవారికి అలవాటు కావాలంటే చాలా సమయం పడుతుందని హైపర్ ఆది కోరినట్టు సమాచారం. అయితే దొరబాబు మాత్రమే కాదు తన టీమ్ లో ఎవరైనా ఈసారి వివాదాస్పద కేసుల్లోకి వెళితే వారిని మాత్రమే కాదు హైపర్ ఆదిని కూడా జబర్ధస్త్ నుంచి తీసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. దానికి హైపర్ ఆది ఒప్పుకున్నాడంట. దొరబాబుతో పాటు పరదేశికి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

హైపర్ ఆది తన టీమ్ మెంబర్స్ అందర్నీ పిలిచి ఇదే విషయం గురించి చెప్పారంట. కాబట్టి ఇకనుంచి అయినా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండమని ఆది తన టీమ్ మెంబర్స్ కు చెప్పారంట. మొత్తానికి దొరబాబు జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడన్నమాట. దొరబాబు జబర్ధస్త్‌ లో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చి, ఒకప్పటిలా తన కామెడీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation