చావుబతుకుల్లో ఉన్న జబర్దస్ట్ కమిడియన్

తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ షో ఓ సంచలనం..! 2013 ఫిబ్రవరిలో మొదలైన ఈ కామెడీ షో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. ఈ షోకి పోటీగా వేరే చానల్స్ కామెడీ తరహా షోస్ ని తీసుకు వచ్చిన జబర్దస్త్ ముందు ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాయి. మల్లెమాల ప్రొడక్షన్స్ ఈ జబర్దస్త్ కామెడీ షో ప్రొడ్యూస్ చేస్తుంది. మరే షోకు లేనంతగా టీఆర్ఎస్ సాధిస్తూ టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది. జబర్దస్త్ షో తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న కమిడియన్స్ అందరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే నవ్వు వెనక ఏడుపు కూడా ఉంటుందన్నట్లు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్‌లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఈయన పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన.

Image result for పంచ్ ప్రసాద్.

అప్పట్లో వరసగా కనిపించిన ప్రసాద్.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్క్రీన్ పై కనిపించలేదు. దాంతో జబర్దస్త్ షో మానేసాడేమో అనుకున్నారంతా. కానీ అసలు ఎందుకు మానేసాడో.. ఎందుకు రాలేదో అసలు నిజాలు ఇప్పుడు చెప్పాడు నాగబాబు. అప్పట్లో వెంకీ మంకీస్ టీంలో చేస్తున్నపుడే ప్రసాద్ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ అని అర్థమైందని.. అయితే అంతే ఎమోషనల్ పర్సన్ కూడా అని తర్వాత తెలిసిందని చెప్పాడు నాగబాబు. ఈజీగా కోపం, బీపీ వచ్చేవని.. ఎందుకురా అంటే అసలు కారణం తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చాడు నాగబాబు. ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయానని.. దాంతో బతకనేమో సర్ అంటూ తన దగ్గరికి వచ్చి ఏడ్చేవాడని గతాన్ని గుర్తు చేసుకున్నాడు మెగా బ్రదర్.

ఈ క్రింది వీడియోని చూడండి

అదే సమయంలో తామంతా అతడికి ధైర్యం చెప్పి.. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే తలా కొంత ఇచ్చి సాయం కూడా చేసామని చెప్పాడు ఈయన. అప్పుడు అనివార్య కారణాలతో సర్జరీ జరగలేదు కానీ ప్రస్తుతం డయాలసిస్‌లో ఉన్నాడని షాకింగ్ నిజాలు చెప్పాడు. ఇప్పటికీ ప్రసాద్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. అయితే త్వరలోనే సర్జరీ చేయించుకుని మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెబుతున్నాడు నాగబాబు. ప్రసాద్ పరిస్థితి చూసిన తర్వాతే జబర్దస్త్ కుటుంబం అంతా కలిసి ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవాలనే రూల్ పెట్టానని చెప్పాడు నాగబాబు. అయితే ఈ కమెడియన్ పరిస్థితి ఇలా ఉన్నా కూడా ఒక్కరోజు ఈటీవీ కానీ మల్లెమాల కానీ పలకరించిన పాపాన పోలేదని చెప్పాడు నాగబాబు. ఏదేమైనా కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం త్వరగా బాగుపడితే అదే చాలంటున్నాడు మెగా సోదరుడు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation