లారెన్స్ తమ్ముడు నాతో వ్యభిచారం చేయిస్తున్నాడు సంచలన నిజాలు చెప్పిన అమ్మాయి

140

అన్న సినిమా ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరు సంపాదిస్తే త‌మ్ముడు మాత్రం టాలీవుడ్ లో చెత్త పేరు సంపాదించాడు.. సినీ డ్యాన్సర్‌, దర్శకుడు లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ అలియాస్‌ వినోద్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్‌గా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ యువతి ఆరోపించింది. ప్రేమ పేరుతో ఎల్విన్‌ వేధింపులకు గురిచేస్తున్నాడ‌ని.. ఈ విష‌యం పై తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నాటి మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌, ప్రస్తుత ఏసీపీ రవీందర్‌ రెడ్డి, ఎల్విన్‌తో కలిసి ఆరేళ్లుగా తనను వేధిస్తున్నాడని మీడియా ముందు చెప్పింది. తనను బ్రోతల్‌ కేసులో ఇరికించి 21రోజులు జైల్లో ఉండేలా చేశారని కన్నీరు పెట్టుకుంది. ఎల్విన్‌, రవీందర్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం పంపినట్లు వెల్లడించింది. ఆమె మాట‌ల్లోనే ఏమి చెబుతుందో విందాం..

Image result for లారెన్స్ తమ్ముడు వేదింపులు యువతి ఫిర్యాదు

మాది వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో హైదరాబాద్‌లో పెద్దమ్మ దగ్గర పెరిగాను. బాల్యంలో నేర్చుకున్న నృత్యం, కరాటే.. నాకు సినీ అవకాశాలు కల్పించాయి. పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. కొన్ని ప్రకటనలకు మోడల్‌గా పనిచేశాను. ఓ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఎల్విన్‌ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నాంటూ ప్రపోజ్‌ చేశాడు. నేను నిరాకరించడంతో కక్ష కట్టాడు. ‘నేను తలచుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్‌లే నా ముందు వాలిపోతారు.. నువ్వెంత నీ లెక్క ఎంత.. అంటూ బెదిరింపులకు దిగడంతో అప్పటి మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశా. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత రవీందర్‌ రెడ్డి నుంచి కూడా నాకు వేధింపులు మొదలయ్యాయి.

Image result for లారెన్స్ తమ్ముడు వేదింపులు యువతి ఫిర్యాదు

విచారణ పేరుతో నన్ను కాటేజీలు, లాడ్జిలకు రమ్మనేవాడు.. నీ కూతురి లాంటి దాన్ని ఎందుకు సర్‌.. ఇబ్బంది పెడుతున్నారని అడిగితే.. నీచంగా మాట్లాడేవారు. తప్పనిపరిస్థితుల్లో మకాం మార్చి, రహస్యంగా తలదాచుకున్నా. అక్కడా నా మీద కుట్ర చేశారు. బ్రోతల్‌ కేసు పెట్టారు. ఒకరోజు కానిస్టేబుల్‌ వచ్చి వెస్ట్‌ మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవిందర్‌రెడ్డి రమ్మంటున్నాడని చెబితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే పోలీసులు తెల్లకాగితం మీద సంతకం పెట్టమని బలవంతం చేశారు. నేను మొండికేసినా బలవంతంగా పెట్టించారు. ఆ సంతకమే నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని అప్పుడు అనుకోలేదు. నేరుగా గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్ళి ఏవో పరీక్షలు చేయించి, కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జైలుకు తీసుకెళ్ళారు. 21 రోజులు జైల్లోనే ఉన్నాను. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ మీద విడుదలయ్యాను. పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టేందుకు వెళ్ళినప్పుడు.. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ రెడ్డి వెకిలిగా నవ్వుతూ అర్థమైందా..

డబ్బులున్న వాళ్ళతో, నాలాంటి పోలీసుల‌తో పెట్టుకుంటే ఇదే గతి పడుతుంది అంటూ కులం పేరుతో దూషిస్తూ దారుణంగా అవమానించారు. కోర్టు వాయిదాల వివరాలు తెలియకుండా కుట్ర చేసి, మరోసారి జైలుకు వెళ్ళేటట్లు చేశారు.. ఇవన్నీ భరించి, నా బతుకు నేను బతుకుదామని అనుకున్నా ఎల్విన్‌, రవీందర్‌ రెడ్డి గ్యాంగులు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. రవిందర్‌రెడ్డి ఇపుడు ఏసీపీ అయ్యారు.. సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్‌ అవతారం ఎత్తారని తెలిసింది. నాకు ఎక్కడా ఆశ్రయం దొరకకుండా వెంటాడుతున్నారు. జేఎన్‌టీయూ హాస్టల్‌ సమీపంలో ఉన్న నా రూమ్‌పై పోలీసులు దాడిచేసి నా ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లు తీసుకుపోయారు. నన్ను కట్టుబట్టలతో మిగిల్చారు. ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నారు.. వీటన్నిటికీ కారణం.. ఎల్విన్‌ చేసే చీకటి వ్యాపారం నాకు తెలియడమే అనుకుంటున్నాను.

ఈ క్రింది వీడియో చూడండి

ఏసీపీ రవిందర్‌ రెడ్డి సైతం డ్యాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని నన్ను ఇబ్బందుల పాల్జేస్తున్నాడు. ఎల్విన్‌ను రక్షించేందుకు నాకు క్యారెక్టర్‌ లేదని నిరూపించే పనిలో రవీందర్‌ రెడ్డి ఉన్నాడు. నేను ఒక బ్రోతల్‌ అని, బ్రోతల్‌ వ్యాపారం చేస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తున్నానని నిరూపించే పనిలో పడ్డారు. నేను ఫిర్యాదు చేసే నాటికి నా వయసు 23 సంవత్సరాలే. తిండికి కూడా ఇబ్బంది పడుతూ, మిత్రుల సాయంతో కాలం వెళ్ళదీస్తున్నాను. పూర్తిస్థాయిలో విచారణ జరిపి లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌, పోలీస్‌ అధికారి రవీందర్‌ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, నాకు రక్షణ కల్పించాలి అని ఆమె కోరింది.యువతి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014-15లో మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఈ యువతి స్టేషన్‌కు వచ్చింది. సినీ కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌తో యువతికి వివాదం ఉంది. ఇందులో భాగంగా మారేడ్‌పల్లిలో ఓ కేసు విషయంలో స్టేషన్‌కు వచ్చింది. కేసుపై విచారణ జరిపాం. ఆమె ఆరోపణలన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవే అని ఏసీపీ ర‌వీంద‌ర్ రెడ్డి అంటున్నారు, దీనిపై ఉన్న‌త స్ధాయి అధికారుల‌కి ఫిర్యాదు అందిన‌ట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation