రాహుల్ సిప్లిగంజ్ కు అదిరిపోయే షాక్.. బిజినెస్ మ్యాన్ తో పునర్నవి పెళ్లి

81

బిగ్ బాస్ 3 పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం బాగా ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఆడిన గేమ్ కంటే కూడా వాళ్ళ రొమాన్స్ ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఇద్దరి రొమాన్స్ కారణంగానే బిగ్ బాస్ షోలో చివరి వరకు పునర్నవి ఉంది. ఇక రాహుల్ అయితే ఏకంగా విన్నర్ అయ్యాడు. దాంతో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. పైగా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది. దీనిపై రాహుల్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే పెళ్లి చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తల్లి చెప్పడంతో నిజంగానే పునర్నవి ప్రేమలో ఉన్నాడని ప్రచారం బాగా జరిగింది. కానీ ఎప్పటికప్పుడు పునర్నవి మాత్రం ఈ విషయం దాటవేస్తూనే ఉంది. రాహుల్ సిప్లిగంజ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే.. అంతకు మించి ఇంకేమీ కాదని చెబుతూనే ఉంది. దానికి తోడు ఆ మధ్య బిగ్ బాస్ షోలో తనకు ఆల్రెడీ ఒక ప్రేమికుడు ఉండేవాడని.. కానీ ఒక ప్రమాదంలో ఆయన చనిపోయాడు అని చెప్పి సంచలనం సృష్టించింది.

Image result for rahul punarnavi

రాహుల్ వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన విషాదాన్ని మరిచిపోయాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ పునర్నవి ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. తను హైదరాబాది కుర్రాడితో ప్రేమలో ఉన్నాను అంటూ చెప్పి రాహుల్ సిప్లిగంజ్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. అయితే రాహుల్ కూడా పక్కా హైదరాబాద్ కుర్రాడే కదా అంటూ సోషల్ మీడియాలో కొందరు పునర్నవిని ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రేమలో ఉన్న హైదరాబాది కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్ అనుకోవచ్చా అంటూ ఆమెను అడుగుతున్నారు. కానీ అతను రాహుల్ కాదని స్పష్టం చేసింది పునర్నవి. మరి ఎవరు అతను అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

అయితే పునర్నవి ప్రేమిస్తుంది హైదరాబాద్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ను అని తెలుస్తుంది. ఇతను ఆమెకు బిగ్ బాస్ కు వెళ్లకముందే పరిచయం ఉందని సమాచారం. అయితే అప్పుడు కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉండేదని, బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కలుసుకున్న వీళ్ళు ప్రేమలో పడ్డారని, ఆ బిజినెస్ మ్యానే ముందు పునర్నవికి ప్రపోజ్ చేశాడని, అతని మీద పునర్నవికి మంచి ఒపీనియన్ ఉండడంతో అతని ప్రేమకు ఒకే చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు అతనికి ఒకే చెప్పాలా వద్ద అనే విషయం గురించి రాహుల్, వరుణ్, వితికాలను అడిగిందట. వాళ్ళు నీ ఇష్టం, అతను నీకు కరెక్ట్ అనిపిస్తే ఒకే చెయ్యమని చెప్పారంట. ఇక పున్నుకు ఎలాగో అతని మీద మంచి ఒపీనియన్ ఉండడంతో అతని ప్రేమకు పచ్చజెండా ఊపిందని సమాచారం. త్వరలోనే వీళ్ళు ఎంగేజ్ మెంట్ చేసుకొని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారా? ఇక ఈ విషయం తెలిసిన వారు అయ్యో పాపం రాహుల్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ క్రింద వీడియో చుడండి:

Content above bottom navigation