Breaking News : సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం.. సీనియర్‌ నటుడు మృతి..

141

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గొల్లపూడి మారుతిరావుతో పాటు మరికొందరు ప్రముఖులు గత రెండు మూడు నెలల్లో కన్నుమూశారు. వారం రోజుల క్రితం సీనియర్ నటుడు జనార్ధన రావు మృతిచెందారు. అలాగే రెండు రోజున క్రితం ప్రముఖ సీనియర్ నిర్మాత సి. వెంకట్ రాజు కన్నుమూశారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for సంతు ముఖోపాధ్యాయ్‌

సీనియర్‌ బెంగాల్‌ నటుడు సంతు ముఖోపాధ్యాయ్‌(60) కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం రాత్రి దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1951లో కోల్‌కతాలో జన్మించిన సంతు యుక్త వయస్సులోనే సినీ రంగంలో ప్రవేశించారు. సంసార్‌ సిమాంటే, రాజా, భాలోబాసా భాలోబాసా వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో మేరిశారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలతో ఆయనకు సత్సంబందాలు ఉన్నాయి. చిరంజీవి నటించిన చాలా సినిమాలో ఈయన గెస్ట్ పాత్రల్లో నటించారు. కానీ ఈయనకు తెలుగులో అంతలా గుర్తింపు రాలేదు. అలాగే బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు.

ఈ క్రింది వీడియో చూడండి

నాలుగు దశాబ్దాలకు పైగా 100 సినెమాలు పైగా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. గత కొంతకాలంగా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బీపీ విపరీతంగా పెరగటం, హైపర్‌ టెన్షన్‌కు గురికావడంతో ఫిబ్రవరి 4న సంతు ముఖోపాధ్యాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం గత వారం ఇంటికి తీసుకురాగా.. బుధవారం మరణించారు. ముఖోపాధ్యాయ్‌కు ఇద్దరు కూతుళ్లు స్వస్థిక ముఖర్జీ, అజోపా ముఖర్జీ ఉన్నారు. వీరిలో స్వస్థిక ముఖర్జీ నటిగా రాణిస్తుండగా, అజోపా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పనిచేస్తున్నారు. ఇతని తమ్ముడు సుమంత ముఖర్జీ కూడా బెంగాలీ సినీ ఇండస్ట్రీలో పెద్ద నటుడిగా కొనసాగుతున్నాడు.

Image result for santhu mukhopadhyay

కాగా సంతు ముఖోపాధ్యాయ్‌ మరణం పట్ల బెంగాల్‌ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌ మంత్రి అరూప్‌ బిశ్వాస్‌ సంతు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక దర్శకుడు కౌశిక్‌ గంగూలీ మాట్లాడుతూ.. సంతు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని, ఆయన మరణాన్ని బెంగాలీ సినీ ఇండస్ట్రీకి జీర్ణించుకోలేకపోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation