సినీ పరిశ్రమలో విషాదం ప్రముఖ సింగర్ ఆత్మహత్య వాట్సప్ మెసేజ్‌లో షాకింగ్ నిజాలు

86

వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్‌ను పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డెత్ నోట్‌ను కూడా రాశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు, అతని తల్లిదండ్రులే కారణమని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం కన్నడ చిత్ర పరిశ్రమ, టీవీ రంగంలో కలకలం సృష్టించింది.

మృతురాలి పేరు సుస్మిత. కన్నడనాట ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోన్న వర్ధమాన గాయని. కొన్ని కన్నడ సినిమాలు, టీవీ సీరియళ్లు, స్టేజీ షోల ద్వారా ఆమె పేరు తెచ్చుకున్నారు. హాలు-తుప్ప, శ్రీసామాన్య వంటి సినిమాలతో పాటు కొన్ని సీరియళ్లకు ఆమె గాత్రాన్ని అందించారు. సుస్మితకు ఏడాదిన్నర కిందట ఆమె వివాహమైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న శరత్ అనే యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వివాహమైన తొలి రోజుల నుంచే అత్తింటి వేధింపులను ఎదుర్కొన్నారు. అదనపు కట్నం కోసం శరత్, అతని తల్లిదండ్రులు సుస్మితను వేధించే వారని మృతురాలి తరఫు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణం వల్లే సుస్మిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. బెంగళూరు నాగరభావి ప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో- సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుస్మిత ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు డెత్ నోట్‌ను రాశారు.

తల్లికి వాట్సప్ ద్వారా మెసేజీని పంపించారు. తన భర్త శరత్‌, అతని తరఫు బంధువులను ఎవ్వర్నీ వదలొద్దని ఇందులో పేర్కొన్నారు. అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, తాను పుట్టి, పెరిగిన ఇంట్లోనే ప్రాణం వదలాలని నిర్ణయించుకున్నట్లు సుస్మిత.. డెత్‌నోట్‌లో పేర్కొన్నారు. తల్లిదండ్రులు వద్దని వారించినప్పటికీ.. తాను శరత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తాను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఆమె ఇందులో రాశారు.

Content above bottom navigation