ఇటలీలో చిక్కుకున్న టాప్ తెలుగు సింగర్

114

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇటలీలో మరణ మృదంగం సృష్టిస్తోంది. చైనాలో ఈ భయంకర వైరస్ పుట్టినప్పుటికీ… ఇటలీలో మాత్రం అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటే, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందరికీ వైధ్య సేవలు అందించే పరిస్థితి కూడా లేకపోవటంతో ప్రాణాలు పోతున్న ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. అయితే ఇలాంటి భయంకర పరిస్థితిల నేపథ్యంలో ఇటలీలోని ఓ టాలీవుడ్‌ గాయని ఇరుక్కుపోయింది. ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలు పాడిన ప్రముఖ యంగ్ సంగర్ శ్వేతా పండిట్… ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లు తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

SHWETA PANDIT LIVE - YouTube

‘మీరందరూ కరోనా వైరస్‌ గురించి వినే ఉంటారు. ప్రస్తుతం అది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను సృష్టిస్తోంది. దీని నివారణ చర్యల్లో భాగంగా భారతదేశం కూడా పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. నిజం చెప్పాలంటే లాక్‌డౌన్‌ కీలకమైన చర్య. ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్‌ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇటలీలో ప్రస్తుతం నేను ఉన్నాను. గత కొన్నిరోజులుగా నా నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నా. మనకి ఎప్పుడు? ఎలా? వచ్చిందనే విషయాన్ని కూడా తెలుసుకోలేని ఒక రకమైన వ్యాధి కరోనా. మనకి వచ్చింది సాధారణ జలుబా? లేక కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షనా? అనేది కూడా తెలుసుకోలేం. అలా మనం ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించేటప్పటికే.. చాలా ఆలస్యమైపోయింది. ఐసీయూలో పెట్టి ఆక్సిజన్‌ అందిస్తారు. కొన్నిసార్లు అలా ఆస్పత్రిలో చేరిన వ్యక్తి కొన్నిరోజులకే మరణిస్తాడు. ఇది జోక్‌ కాదు. చాలా ప్రమాదకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులను చూస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికే 8వేల మంది కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజూ అంబులెన్స్‌ సైరెన్‌తో నేను నిద్రలేస్తున్నాను. ఇది నిజం. ప్రజలు నాకు ఫోన్‌ చేసి నా బాగోగులు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వారి ప్రార్థనలు, దేవుడి ఆశీస్సుల వల్లే నేను ఇంకా ఆరోగ్యంగా ఇంట్లోనే ఉండగలిగాను.’

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అమెరికా, లండన్‌, ఇప్పుడు భారత్‌. ఇటలీకి అది ఎలా వ్యాపించిందని చాలా మంది నన్ను అడిగారు. మాకు కూడా నిజం ఏమిటనేది పూర్తిగా తెలియదు. మేం దాని గురించి తెలుసుకునే సమయానికి ఆ మహమ్మారి దాని రెక్కలను ఇటలీ అంతా వ్యాప్తి చేసేసింది. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. అందుకే హోలీ వేడుకల కోసం ఏదో ఒక విమానంలో భారత్‌కు రావాలని అనుకున్నా. కానీ నా ద్వారా ఆ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడం నాకు ఇష్టం లేదు. నువ్వు కలిసే వ్యక్తికి కరోనా వైరస్‌ ఉందో లేదో కూడా నువ్వు తెలుసుకోలేవు. అందుకే నేను ఇలా ఇటలీలోనే ఉన్నాను. అందరూ కలిసి పోరాడి.. ఆ వైరస్‌ను నశించేలా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. చేతులను శుభ్రంగా కడుక్కోండి. కుటుంబసభ్యులతో మాట్లాడినా సరే.. దూరం పాటించండి. భారత్‌లో లాక్ డౌన్ నడుస్తున్నట్లు తనకు తెలిసిందంది. తనకు భారత్‌ కు రావాలని ఉన్నా… ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను ఇండియాకు రావడం కరెక్ట్ కాదంది. అందుకే తాను ఇటలీలోనే ఉండిపోయాయని తెలిపింది. తన ద్వారా తనకు తెలియకుండా వైరస్ ఎక్కడ భారత్‌కు వస్తుందన్న భయంతోనే… రావడం లేదని తెలిపింది శ్వేతా పండింట్. భారతీయులంతా క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానుభావుడు, ఓం నమో వేంకటేశాయ లాంటి తెలుగు సినిమాల్లో సూపర్‌ హిట్ సాంగ్స్‌ పాడింది శ్వేత పండిట్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు పాటలు ఆలపించిన శ్వేతా ప్రస్తుతం ఇటలీలో చిక్కుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె అక్కడ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు.

Content above bottom navigation