Breaking News : తెలుగు హీరోయిన్‌ కు కరోనా వైరస్..

260

ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా క‌రోనా అన్న పేరు చెపితేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు. Covid-19 ధారాళంగా విస్తరించడం వలన ప్రపంచమంతా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య క్రమేనా తగ్గుతుంటే.. ఇతర దేశాల్లో మాత్రం పెరుగుతున్నారు. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలనే కాదు సెలెబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కు కరోనా వచ్చింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for ఇందిరా వర్మ

కామ సూత్ర హీరోయిన్‌ కు కూడా కరోనా వైరస్ సోకింది. కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మ కరోనావైరస్ బారిన పడింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇందిరా వర్మకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఇందిరాను ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌ కు తెలిపింది. బుధవారం ప్రొడక్షన్‌ కు సంబంధించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. కరోనా వ్యాపిస్తున్న కారణంగా తన షో ఆగిపోయినట్టుగా తెలిపింది.

అంతేకాదు కరోనా కారణంగా తాను అనారోగ్యం పాలైనట్టుగా కూడా ఆమె పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో షోస్ క్యాన్సిల్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది ఇందిరా.హాలీవుడ్‌లో రాణిస్తున్న ఇందిరా వర్మకు భారత సంతతి మూలాలు ఉన్నాయి. తండ్రి ఇండియన్ కాగా, తల్లి స్విస్ దేశస్థురాలు. 1996లో కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్, 2004లో బ్రైడ్ అండ్ ప్రిజ్యుడీస్ అనే చిత్రాల్లో నటించింది. 2014 నుంచి 2017 వరకు ప్రసారం అయిన గేమ్‌ ఆఫ్ త్రోన్స్‌ ఎపిసోడ్స్‌ లో ఎల్లారియా సాండ్ పాత్రలో మెరిసి అందర్నీ మెప్పించింది.

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Image result for కామ సూత్ర హీరోయిన్‌

మరోవైపు గేమ్ ఆఫ్ త్రోన్‌ లోనే నటించిన మరో నటుడు క్రిస్టోఫర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని క్రిస్టోఫర్‌ తెలిపారు. అలాగే హాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ టామ్‌ హ్యాంక్స్‌, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఓల్గా కురేలేంకో కూడా చేరింది. ఇక ఈ లిస్టులో ఇప్ప‌టికే ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌లు కూడా ఉన్నారు. లాస్ట్ వీక్ కరోనాతో బాధపడుతూ యూనివర్సల్‌ మ్యూజిక్‌ అధినేత, సీఈవో లుసియన్‌ గ్రినేజ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇలా చాలామంది ప్రముఖులు కరోనా మూలాన హాస్పిటల్ బారిన పడుతున్నారు. మ‌రి ఈ వైర‌స్ ఎప్పుడు త‌గ్గు ముఖం ప‌డుతుందో ? ప్ర‌పంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.

హైదరాబాద్‌ను చుట్టేసిన 69వేల మంది విదేశీ ప్రయాణికులు

జబర్దస్త్ లో రియల్ ఫైట్… కొట్టుకున్న భాస్కర్, అప్పారావు ..

కరోనా వైరస్ జీవిత కాలం ఎంత? ఎన్ని రోజులు ?

Content above bottom navigation