టాలీవుడ్ లో విషాదం యువ హీరో మృతి

124

టాలీవుడ్ లో మ‌రో విషాదం అల‌ముకుంది.. ఇప్ప‌టికే సీనియ‌ర్ న‌టుల‌ని కోల్పోతున్న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌రో యువ హీరోని పొగొట్టుకుంది..అతిచిన్న వ‌య‌సులోనే సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ హీరో అకాల మ‌ర‌ణం చెందారు.ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు విషాదాలు జరిగాయి. చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూసిన విషాదం నుంచి బయటకు రాకముందే ఒక కుర్ర హీరో గుండెపోటుతో మరణించాడు. తెలుగు తమిళ సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ హఠాన్మరణం చెందాడు. పరారే పరరె, ఫ్రెండ్స్ బుక్ లాంటి పలు తమిళ సినిమాలలో హీరోగా నటించిన నందురీ ఉదయ్ కిరణ్ క‌న్నుమూసాడు, ఆయ‌న వ‌య‌సు 34 సంవ‌త్స‌రాలు.

Image result for టాలీవుడ్ లో విషాదం యువ హీరో మృతి

ఫిబ్రవరి 14 రాత్రి 10.30కు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు ఉదయ్ కిరణ్. ఈయన పేరుకు తమిళ సినిమాలు చేసినా ఆయ‌న పుట్టింది పెరిగింది తెలుగు నేల‌పైనే, ఆయ‌న తెలుగు కుర్రాడు. ఉదయ్ కిరణ్ మరణవార్త తెలుసుకుని స్థానికులతో పాటు.. తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది. త‌మిళ్ లో యువ హీరోగా మంచి సినిమాలు చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రహీరో ఇలా అర్ధాంతరంగా మరణించడం అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రామారావు పేట తన స్వగృహంలో పార్థివ దేహాన్ని ఉంచారు కుటుంబ సభ్యులు… ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు పలువురు పెద్దలు.. రాజకీయ నాయకులు. ఆయ‌న‌కు ప‌లువురు సీనియ‌ర్ న‌టులు ద‌ర్శ‌కుల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి, వారు చివ‌రి చూపుకి కాకినాడ వెళుతున్నారు, అలాగే కాకినాడ‌లో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు ఆయ‌న ఇంటికి చేరుకుంటున్నారు, టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ ఆయ‌న మృతిపై సంతాపం తెలిపింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation