Breaking News : కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ అరెస్ట్.. షాక్ లో తమిళ్ ఇండస్ట్రీ

డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం భారతీయుడు-2. ఈ మూవీ షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం(ఫిబ్రవరి 19,2020) రాత్రి షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్‌ ఉన్నారు. అలాగే 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్ కాలు బోన్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్‌తో పాటు గాయపడ్డ వారికి చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడ్డవారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ ప్రమాద ఘటన చిత్ర యూనిట్ ని కష్టాలు వెంటాడుతున్నాయి. బాధితుల కుటుంబాలకు హీరో కమల్ హాసన్ తలో కోటి, శంకర్ తలో కోటి ప్రకటించారు. అయినా కూడా ప్రభుత్వం, పోలీసు విభాగం, దర్యాప్తు సంస్థలు మాత్రం వారిని వదిలిపెట్టడంలేదు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ కీలక దశలో ఉంది. ఇప్పటికే శంకర్ ని అధికారులు విచారించారు. రేపు కమల్ హాసన్ ని విచారించడానికి నోటీసులు జారీ చేసారు. ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం రేపు విచారించనుంది. అయితే మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్, శంకర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమల్ హాసన్, క్రేన్ ఆపరేటర్‌లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్‌లకు నోటీసులు పంపించారు. విచారణ ఇక నుంచి కీలక దశలో ఉండే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది.

Image result for shankar kaml

శంకర్ కు, కమల్ హాసన్ ను నోటీసులు అందడంతో ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది. రోబో 2.0 తర్వాత డైరెక్టర్ శంకర్.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్‌హాసన్‌, సిద్ధార్థ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సుభాష్‌ కరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఇప్పుడు వరుస కేసులు ఎదురవడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation