breakingnews : మెగాస్టార్ ఆరోగ్య పరిస్థితి విషమం

90

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంపాదించిన పేరు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. కేవలం మన దేశంలోనే కాక పలు దేశ విదేశాల్లో కూడా బిగ్ బి కి ఎంతో మంది వీరాభిమానులున్నారు. ప్రత్యేకించి షోలే, జంజీర్, దీవార్, అగ్నీ పథ్, డాన్, ఆనంద్, తో పాటు ఇటీవల వచ్చిన పా, షమితాబ్, సర్కార్, పీకు, బ్లాక్ వంటి సినిమాల్లో ఆయన అత్యద్భుత నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఓ పక్క సినిమాలు మరోపక్క ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ముఖ్యంగా అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం. వారంలో ఒకరోజు ఖచ్చితంగా అభిమానులను కలుసుకుంటుంటాడు అమితాబ్. నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు, అవార్డులు, రివార్డులు అందుకుని బాలీవుడ్ మెగాస్టార్ గా కీర్తింప బడుతున్న అమితాబ్ బచ్చన్ సినీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే అది కెరీర్ పరంగా కాదు, సినిమా షూటింగుల సందర్భంగా ఆయన గాయాల పాలవడం వలన కలిగిన ఆరోగ్య సమస్యలు.

Image result for amithab

ఆయన కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో అనుకోకుండా ఒక ఫైట్ సీన్ లో ఫైటర్ ఆయనను గట్టిగా కడుపులో గుద్దడంతో ఆయనకు కడుపు నొప్పి రావడం, ఆ తరువాత వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగింది. ఇక ఆ ఘటన వలన ఇప్పటికీ కూడా కడుపు భాగంలో తనకు అప్పుడప్పుడు ప్రాణం పోయేంత నొప్పి వస్తుందని అమితాబ్ చెప్తుంటారు. ఇక అది మాత్రమే కాక, చాలా ఏళ్ళ క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో తన కాలికి గాయం అయిందని, అయితే షూటింగ్ జరుగుతున్న ప్రాంతం సిటీకి ఎంతో దూరంగా ఉండడంతో, అప్పటికే గాయంతో రక్తం విపరీతగా పోతుండడంతో స్థానిక డాక్టర్ సాయంతో దానికి చికిత్స అందించడం జరిగిందని, అయితే ఆ సమయంలో తనకు రక్తం కూడా ఎక్కించారట. కానీ ఆ రక్తంలో హెపటైటిస్ బి ఉందని, అయితే ఆ విషయం తనకు 20 ఏళ్ళ తరువాత తెలిసిందని, కానీ అప్పటికే తనకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి లివర్ దాదాపుగా 75% వరకు పాడయినట్లు డాక్టర్లు చెప్పారని అమితాబ్ అన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

దానివలన మధ్యలో తనకు టిబి వ్యాధి సోకి ఎంతో దెబ్బతిన్నానని, కావున ప్రస్తుతం తాను కేవలం 25% లివర్ తో మాత్రమే జీవిస్తున్నానని అమితాబ్ ఇటీవల ఒక షోలో చెప్పారు. ఇలా ఉండగానే ఇప్పుడు అమితాబ్ ఆరోగ్య పరిస్థితి మరొకసారి విషమించిందని, రెండు రోజుల క్రితం అమితాబ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న బిగ్ బిగ్ ఫ్యాన్స్, ఆయన ఆరోగ్యం కుదుటపడి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ వార్త ఆయన ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షక లోకానికి గుండెను బద్దలు చేసే వార్తే అని చెప్పాలి. ప్రస్తుతం 76 సంవత్సరాలు. తరచూ అనారోగ్యం వేధిస్తున్నా, వయసు సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నటుడిగా ఆయన అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నారు. గత ఏడాది ఆయన నటించిన ‘బద్లా’ చిత్రం విజయం అందుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఇంకా మంచి మంచి చిత్రాలలో నటించి మన అందరిని అలరించాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation