ప్ర‌ముఖ సినీన‌టుడు అతని భార్య‌కు క‌రోనా వైర‌స్

137

క‌రోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ ర‌క్క‌సి భారీన ప‌డి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది బాధితుల సంఖ్య న‌మోదు అవుతోంది.వైర‌స్ సోకితే ప్రాణం పోతుంద‌నే భ‌యం సామాన్య జ‌నానికి మ‌రింత పెరిగింది.వైర‌స్ ఎవ‌రికి సోక‌కుండా నివార‌ణ ఒక్క‌టే ఈ వైర‌స్ కు మార్గం అని చెబుతున్నారు వైద్యులు.సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ వైర‌స్ కి ఎఫెక్ట్ అయిన వారే.
తాజాగా మ‌రో సినిమా జంట‌కు ఈ వైర‌స్ సోకింది.ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ కూడా ఈ వార్త‌తో డైలమాలోకి పోయింది. మ‌రి ఏ చిత్ర సీమ‌కు ఈ వైర‌స్ పాకింది ఆ జంట ఎవరు అనేది చూద్దాం.తాజాగా.. ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ అలాగే అతని భార్య, నటి రీటా విల్సన్ ఇద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారిద్దరూ ఆస్ట్రేలియాలోని ఒక ఆస్పత్రిలో ఉన్నారు. ఒక చిత్ర నిర్మాణం కోసం ఈ దంపతులిద్దరూ ఆస్ట్రేలియా వెళ్లారు. తామిద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు టామ్ హాంక్స్ తన ట్విట్టర్లో తెలిపారు.

Image result for kovid corona

నేను మరియు రీటా ఒక సినిమా కోసం ఇక్కడికి వచ్చాం. మాకు కొంచెం జ్వరంతో పాటు, బాడీ పెయిన్స్ కూడా వచ్చాయి. దాంతో హాస్పిటల్‌కి వెళ్లాం. అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి కరోనా పాజిటివ్‌గా తేల్చారు. వైరస్ కంట్రోల్‌లోకి వచ్చేంతవరకు ఇక్కడే ఉండాలని డాక్టర్లు మాకు సూచించారు అని టామ్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.ఎల్విస్ ప్రెస్లీ జీవితచరిత్రపై తెరకెక్కుతున్న ఒక సినిమాలో హాంక్స్ రాకర్స్ మేనేజర్ కల్నల్ టామ్ పార్కర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణకోసం టామ్ దంపతులు ఆస్ట్రేలియాకు వెళ్లారు. 1990 కాలంలో ఫిలడెల్ఫియా మరియు ఫారెస్ట్ గంప్‌లలో చేసిన ప్రదర్శనలకుగాను హాంక్స్ అకాడమీ అవార్డులను గెలుచుకున్నారు. టామ్ పలు సినిమాలలో నటిస్తూ.. దర్శకుడిగా కూడా పనిచేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ వార్త హాలీవుడ్ న‌టుల‌ని ద‌ర్శ‌కుల‌ని నిర్మాత‌ల‌ని షాక్ కి గురి చేసింది, వారి ఆరోగ్యం గురించి అక్క‌డ చిత్ర ప‌రిశ్ర‌మ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చిస్తున్నారు… అలాగే మ‌రో కేసు చూస్తే.. కరోనా వైరస్ ప్రబలుతున్నందువల్ల ముందు జాగ్రత్తగా తన షోను నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు జలుబుతో బాధపడుతున్న ప్రముఖ గాయకురాలు సీలైన్ డియాన్ ప్రకటించారు. తనకు జరిపిన పరీక్షలో కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చిందని సీలైన్ ప్రకటించారు….ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల 118 దేశాలలో 121,000 మందికి పైగా అనారోగ్యం బారిన పడ్డారు. దాదాపు 4,300 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation