చిరంజీవి సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఫాన్స్ కు పండుగే

టాలీవుడ్ లో రైటర్ నుంచి దర్శకుడిగా మారి వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను..ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చుడండి

ఇక పెద్ద హీరోల సినిమాలంటే ఏదో ఒక గాసిప్ రోజూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమాపై అంచనాలు పెంచేయడానికి ఈ రూమర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంటాయి. చిరు, కొరటాల శివ సినిమాపై కూడా ఓ గాసిప్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. చిరు కొరటాల సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్‌ లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటించనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మహేష్ – కొరటాల కాంబినేషన్‌లో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దాంతో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ చొరవతోనే మహేష్‌ ను చిరు సినిమాలో నటించాల్సిందిగా కొరటాల శివ కోరారట. ఇదే విషయం గురించి కొరటాల చిరంజీవికి చెప్తే.. మహేష్ కంటే చరణ్ ఉంటేనే బాగుంటుంది అన్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ చిరు సినిమాలో మహేష్ నటిస్తే చూడాలని ఫ్యాన్స్ తెగ ఆతృత పడిపోతున్నారు.

Image result for చిరంజీవి సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు

అయితే తన సినిమా గురించి ఎలాంటి రూమర్ వచ్చినా వెంటనే సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తుంటారు కొరటాల. కానీ ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై మాత్రం ఆయన స్పందించలేదు. కానీ ఈ రూమర్స్‌ లలో ఎలాంటి నిజం లేదని కొరటాల తన సన్నిహితులతో చెప్పాడంట. చిరు సినిమాలో మహేష్ నటిస్తున్నారన్న విషయంలో ఎలాంటి నిజం లేదని చెప్పారట. ఈలోగా ఫ్యాన్స్ ఈ రూమర్స్ ప్రచారం చేస్తుండడంతో కొరటాల టెన్షన్ పడుతున్నారట. అసలే చిరుతో సినిమా. లేనిపోని రూమర్స్ వల్ల ఫ్యాన్స్ వేరే విధంగా అంచనాలు పెంచేసుకుంటే, సినిమాపై ప్రభావం చూపుతుందని కొరటాల టెన్షన్ పడుతున్నారంట. ఇక ఈ సినిమాలో చిరంజీవి చేసే ఫైటింగ్ సీన్లపై కొరటాల ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కొరటాల శివ సినిమాలంటేనే డిఫరెంట్ ఫైటింగ్ సీన్స్‌కి పెట్టింది పేరు. ఉదాహరణకు ‘మిర్చి’లో వర్షంలో ఫైట్స్, ‘జనతా గ్యారేజ్’లో మున్సిపల్ ఆఫీస్‌లో జరిగే ఫైట్, ‘భరత్ అనే నేను’లో థియేటర్‌లో ఫైటింగ్ సీన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చిరు సినిమా అంటే అంతకంటే ఎక్కువ రేంజ్‌లో ఫైటింగ్ సీన్స్ ఉండాలి. అందుకే కాస్త వెరైటీగా గుడిలో ఫైటింగ్ సీన్స్‌ ను ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ కన్ఫార్మ్ చేసినట్లు తెలుస్తుంది. గోవింద ఆచార్య అని ముందు అనుకున్నా కూడా గోవింద తీసేసి కేవలం ఆచార్య మాత్రమే కన్ఫార్మ్ చేసాడు కొరటాల శివ. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation