శ్రీముఖీ ఇంట్లో పెళ్లి సందడి

114

తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది యాంకర్లు తమ యాంకరింగ్ తో మెప్పించారు.. కానీ అతి కొద్ది మంది పేర్లు మాత్రమే ఎక్కువ వినిపిస్తుంటాయి. తెలుగు బుల్లితెరపై యాంకర్లు అనగానే మొట్ట మొదట వినిపించేది సుమ కనకాల పేరు.. ఆ తర్వాత ఝాన్సీ, ఉదయభాను పేర్లు. ఇక తెలుగు లో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యారు యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్. ఈ యాంకర్ల పేర్ల తర్వాత ఎక్కువగా విపించేది శ్రీముఖి. అందం, అభిన‌యం, చిలిపిత‌నం, మాట‌ల గార‌డి,మెస్మ‌రైజ్ చేసే డైలాగులు ఇవి శ్రీముఖి యాంక‌రింగ్ కు మ‌రింత అందాన్ని తీసుకువ‌చ్చాయి, టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఇటు యాంక‌ర్ గా బుల్లితెర‌లో అభిమానుల‌ని సంపాదించుకుంది శ్రీముఖి..శ్రీముఖీ అనగానే అందరికి పటాస్‌ షో గుర్తుకువస్తుంది. పటాస్‌లో శ్రీముఖి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. .

Image result for srimukhi

పటాస్ కార్యక్రమంతో రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి కేవలం బుల్లితెరపైనే కాాదు వెండి తెరపై కూడా కనిపించింది. కానీ పెద్దగా పేరు మాత్రం సంపాదించుకోలేకపోయింది. గత ఏడాది నాగార్జున హూస్ట్ చేసిన బిగ్ బాస్ 3 లో శ్రీముఖి చివరి వరకు కొనసాగినప్పటికీ.. రన్నరప్ గా మాత్రమే నిలిచింది. బిగ్ బాస్ 3 విన్నర్ గా సింగర్ రాహూల్ సిప్లిగంజ్ నిలిచారు. అయితే బిగ్ బాస్ 3 లో శ్రీముఖి-రాహుల్ కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లా సాగిన విషయం తెలిసిందే. గతంలో పటాస్ కార్యక్రమంలో యాంకర్ రవి-శ్రీముఖి సందడి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ స్టేజీపైనే ముద్దులు పెట్టుకున్నారు. ఆ వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాంతో వీరి మద్య ఏదో ఉందని తెగ పుకార్లు వచ్చాయి.. కానీ వీరిద్దరు మాత్రం కేవలం అది షో అని తమ మద్య ఎలాంటి రిలేషన్ లేదని.. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో రావడం కామన్ అని కొట్టిపడేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆ తర్వాత ఇద్దరూ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ జీ టివిలో ఓ పోగ్రామ్ లో పాల్గొంటున్నారు. తాజాగా శ్రీముఖి ఇంట పెళ్లిబాజా మోగింది.. అయితే ఈ అమ్మడి పెళ్లి అయిపోయిందని అందరూ భావించారు. ట్విస్ట్ ఏంటేంటే ఆ పెళ్లి శ్రీముఖిది కాదు.. ఆమె సోదరిది… శ్రీముఖీ సోదరి పెళ్లి కావటంతో సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు విడుదల చేసింది. మొత్తానికి శ్రీముఖి పెళ్లి చేసుకుందా.. అయితే ఇంత గోప్యంగా ఉంటుందా అని అందరూ భావించినప్పటికీ ఆమె సోదరి వివాహం అని తెలిసి అంతా సైలెంట్ అయ్యారు. సో శ్రీముఖి పెళ్లి చేసుకుంటే క‌చ్చితంగా అంద‌రికి చెప్పి చేసుకుంటుంది అంటున్నారు ఆమె అభిమానులు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation