జబర్దస్త్ కమెడియన్‌తో అసభ్య ప్రవర్తన

153

జబర్దస్త్ కామెడీ షోలో చేస్తున్న కమెడియన్లకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షో ఒక్కటే కాదు బయట రియాలిటీ షోలతో పాటు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా చేస్తూనే ఉంటారు. దానికోసం ఎప్పటికప్పుడు బయట ఊళ్లకు వెళ్తుంటారు. అయితే అక్కడ తమకు చాలా రకాలుగా కొందరు చుక్కలు చూపిస్తుంటారని ఇదివరకే కొందరు కమెడియన్లు చెప్పారు. అంతెందుకు జబర్దస్త్‌లో ఆడ గెటప్ వేసే వాళ్లపై కూడా అసభ్యంగా ప్రవర్తించే వాళ్లుంటారు. ఈ మధ్యే ఆపేరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన సాయి తేజ్ ఉరఫ్ ప్రియాంకతో ఓ దర్శకుడు రూమ్‌కు వస్తావా అని అడిగినట్లు చెప్పింది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

శాంతి స్వరూప్ (shanthi swarup)

ఈ వీడియో ప్రస్తుతం బాగానే వైరల్ అవుతుంది. అసలు ఏ అమ్మాయితో ఇలా చేసారని అనుకుంటున్నారా..?అమ్మాయి కాదు.. అబ్బాయితో కొందరు కుర్రాళ్లకు ఇలా మిస్ బిహేవ్ చేసారు. అతనెవరో కాదు.. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో చాలా పాపులర్ అయిన శాంతి స్వరూప్. ఈయనతో ఇప్పుడు కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. గతంలో కూడా కొందరు ఇలాగే తనను వేధించారని చెప్పాడు శాంతి. అప్పట్లో తనకు రాత్రికి రేట్ ఎంత అంటూ దారుణంగా కామెంట్ చేసారని ఏడ్చాడు కూడా. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి తిప్పలే వచ్చాయి ఈయనకు. ఈ సారి ఏకంగా కొందరు కుర్రాళ్లు వచ్చి ఫోన్ మాట్లాడుతున్న శాంతి స్వరూప్‌ను వెనకనుంచి వచ్చి ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించారు.

ఈ క్రింది వీడియో చూడండి

అందులో ఒకడు అయితే అతడితో చాలా దారుణంగా మాట్లాడాడు కూడా. దాంతో కోపం నషాలానికి అంటి చెప్పు కూడా తీసాడు శాంతి స్వరూప్. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే చివర్లో ఇదంతా ప్రాంక్ అని చెప్పి శాంతి స్వరూప్‌ను ఫూల్ చేసారు. ఏదేమైనా కూడా అప్పటి వరకు మాత్రం చాలా సీరియస్‌గా సాగింది వాళ్ల మధ్య సంభాషణ. మధ్యలో కొన్ని బూతులు కూడా మాట్లాడేసాడు శాంతి. ఏదేమైనా కూడా ఇలాంటి ప్రాంక్స్ ఒక్కోసారి రాంగ్ డైరెక్షన్‌లో కూడా వెళ్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation