బాలకృష్ణ భార్య వసుంధరకు భారీ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

115

సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ ఇంటర్ నెట్ ద్వారానే జరిగిపోతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఎన్ని లక్షలైనా కోట్లయినా ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చు. ఏ చెల్లింపులైనా చేయొచ్చు. ఇందుకు కావాల్సింది నెట్ బ్యాంకింగ్ ఫెసిలటీ, ఓ పాస్ వర్డ్. అంతే. అయితే కొన్నిసార్లు ఇవే శాపంగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన మన అకౌంట్ పడిందంటే, ఇక అకౌంట్ లో డబ్బులు మాయమయినట్టే. ఇప్పుడు సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ భార్య వసుంధర విషయంలో ఇలాగే జరిగింది. బాలకృష్ణ భార్య వసుంధర సంతకం ఫోర్జరీ అయ్యింది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఆమె సంతకం ఫోర్జరీ అయ్యిందని తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారో తెలుసుకొని షాక్ తిన్నారు.

ఈ నెల 13న బంజారాహిల్స్ HDFC బ్యాంక్ రిలేషన్‌ షిప్ మేనేజర్లు శ్రీనివాస్, ఫణింద్ర బాలయ్య అకౌంటెంట్ సుబ్బారావుకు ఫోన్ చేశారు. ఆయన సతీమణి వసుంధర అకౌంట్‌ కు సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, యాక్టివేషన్ చేయాలా వద్దా అని అడిగారు. సీన్ కట్ చేస్తే తాము నెట్ బ్యాంకింగ్ కోసం అప్లై చేయలేదని అకౌంటెంట్ చెప్పడంతో బ్యాంక్ మేనేజర్లు షాక్ తిన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో బాలయ్య సతీమణి వసుంధరను సంప్రదించారు. ఆమె కూడా తాను నెట్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పడంతో దిమ్మ తిరిగింది.

Image result for balakrishna wife

ఆ తర్వాత బ్యాంక్ అధికారులు ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బ్యాంకింగ్ స్మార్ట్ ఫోన్ అప్లికేష‌న్ కోసం ఆమె నుంచి ఎలాంటి ద‌ర‌ఖాస్తూ వెళ్ల‌లేద‌ని అధికారులు గుర్తించారు. ఆమె సంత‌కంతో కూడుకున్న అప్లికేష‌న్ ఫేక్ అని ప‌ట్టేశారు. ఆమె సంత‌కాన్ని ఎవ‌రో ఫోర్జ‌రీ చేశార‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆమె సంతకం ఫోర్జరీ అయినట్లు తేలింది.. ఎవరు దరఖాస్తు చేశారని ఆరా తీశారు. వసుంధర పేరుతో ఉన్న డాక్యుమెంట్లపై ఉన్న సంతకాలను పరిశీలించారు. వసుంధర అకౌంటెంట్ సుబ్బారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీయగా..

అదే బ్యాంకులో పనిచేస్తున్న అకౌంటెంట్ శివ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. అతడే సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. సంతకాన్ని ఫోర్జరీ చేసిన శివ కూడా ఇటీవలే బ్యాంకులో ఉద్యోగిగా చేరినట్లు తెలుస్తోంది. కొర్రి శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వ‌సుంధ‌ర సంత‌కాన్ని తానే ఫోర్జ‌రీ చేసి అప్లికేష‌న్ పెట్టిన‌ట్టుగా అత‌డు ఒప్పుకున్నాడ‌ట‌. శివపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ ఎందుకు ఈ విధంగా ఫోర్జరీ చేయాల్సి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Content above bottom navigation