ప్రభాస్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..

చాలా వరకు ప్రతీ సినిమాలో కూడా పద్దతిగానే కనిపించిన నిహారిక.. బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక.. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది. ఇకపై కూడా ఇదే చేస్తానని చెప్పింది. ఇప్పట్నుంచి తాను మోడ్రన్ డ్రస్‌లో కనిపిస్తానని.. రొమాంటిక్ రోల్స్ కూడా చేస్తానని చెబుతుంది. నిజానికి తన తర్వాతి సినిమాలో పూర్తి రొమాంటిక్ రోల్ చేస్తున్నట్లు కూడా అభిమానులతో పంచుకుంది నిహారిక. తెలుగులో ఆచార్య సినిమాలో చిన్న పాత్రలో నటించబోతుంది నిహారిక కొణిదెల.

తాజాగా మెగా డాటర్, కొణిదెల నాగబాబు కూతురు నిహారికను ఇంటర్వ్యూ చేసిన ఓ మీడియా.. ప్రభాస్‌తో మీ పెళ్లిపై వస్తున్న వార్తల సంగతేంటి? అని ప్రశ్నించింది. దీనిపై రియాక్ట్ అయిన నిహారిక అలాంటి వార్తలపై క్లారిటీ ఇస్తూ సమాధానమిచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా డాటర్ నిహారిక ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే నిహారికకు అదే ప్రశ్న ఎదురైంది. దానికి బదులిచ్చిన మెగా డాటర్.. ఐ యామ్ సారీ టు డిజప్పాయింట్, నేను ప్రభాస్‌ని లవ్ చేయడం లేదు అని సింపుల్‌గా చెప్పేసింది. తన ఫ్యామిలీ అందరిలో బెస్ట్ కజిన్ వైష్ణవ్ తేజ్ అని, చిన్నప్పటి నుంచే వైష్ణవ్‌‌తో ఫుల్ క్లోజ్‌గా ఉండేదాన్నని, వైష్ణవ్ మనసు వెన్న అని చెప్పుకొచ్చింది నిహారిక.

అలాగే సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడిన నిహారిక.. తేజ్ బావ, తనను ఎప్పుడైనా తల్లీ, పాప అనే పిలుస్తాడని తెలిపింది. తేజ్ బావ తనను పేరు పెట్టి పిలిచిన సందర్భం ఒక్కటి కూడా గుర్తులేదని చెప్పింది. నిహా తల్లి అని మాత్రమే అంటాడని, రియల్లీ లవబుల్ పర్సన్ అనేసింది. అత్త కొడుకు కాబట్టి తేజ్‌ని బావ అని పిలుస్తానే తప్ప, తనకు అన్నలాగే అని చెప్పుకొచ్చింది నిహారిక.

Content above bottom navigation