హీరో నితిన్ పెళ్లి వాయిదా..కారణం ఏంటో తెలిస్తే షాక్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల‌తో హిట్ కొట్టి టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇష్క్’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక ఈయ‌న త్వ‌ర‌లోనే హీరో నితిన్‌ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

కుర్ర హీరో నితిన్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. షాలిని అనే అమ్మాయిని నితిన్ దాదాపు నాలుగేళ్లుగా ఇష్టపడుతున్నారట. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారూ ఒప్పేసుకున్నారు. దాంతో ఇదే ఏడాది పెళ్లి చేసేయాలని నిర్ణయించేసుకున్నారు. అదీకాకుండా ఓ ఇంటర్వ్యూలో ఇదే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నానని నితిన్ చెప్పడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. పెళ్లి ఏప్రిల్ 15న జరగనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వర్క్‌ వల్ల నితిన్ ఏప్రిల్‌లో పెళ్లి పెట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. దుబాయ్‌లోని పలాజో వర్సాచే హోటల్‌ నితిన్ పెళ్లికి వేదిక కాబోతోందట. ఇప్పటికే ఇంట్లో వారు అన్ని ఏర్పాట్లు చేసేశారట. మరో నెల రోజులు పెళ్లి వాయిదా వేశారు కాబట్టి వివాహం దుబాయ్‌లోనే జరుగుతుందా లేకపోతే ఇండియాలోనే జరగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. 2019 లో నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ గ్యాప్‌లో కథలు విన్న నితిన్ ఒకేసారి నాలుగు చిత్రాలు ప్రకటించాడు. ఆయన ప్రస్తుతం ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటించారు. 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భీష్మతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు నితిన్‌. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. నితిన్ మూడవ సినిమాను విభిన్న చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటితో చేస్తున్నాడు. ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అలాగే నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఏడాదే స్టార్ట్ చెయ్యనున్నాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation