అలా చేసి ఉంటే సౌందర్య బ్రతికేది.. ఆమె మృతి వెనుక షాకింగ్ విషయాన్ని చెప్పిన పరుచూరి

సౌందర్య గారు తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయే నటి. ఎలాంటి పాత్రలో అయిన ఇమిడిపోగల నటి ఆమె. తెలుగు వారు సౌందర్యని వాళ్ళ ఇంట్లో మనిషిలా అనుకునే వాళ్లంటే ఆమె తెలుగు ప్రజల మనస్సుల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసి హిట్లు కొట్టిన నటి. సౌందర్య గారిని ఈ తరం సావిత్రమ్మ అనేవారు. తన 12 సంవత్సరాల తెలుగు సినీ కెరీర్ లో 114 సినిమాలు తీసింది. 2004 ఏప్రిల్ 17 న బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్ కి వస్తుండగా విమాన ప్రమాదంలో సౌందర్య గారు మృతి చెందారు. అయితే ఆమె చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు వీడియో కార్యక్రమంలో ఆమె గురించి మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం.

Image result for paruchuri palukulu

చాలా రోజులుగా పరుచూరి పలుకులు కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. కానీ నాకు అత్యంత ఇష్టమైన సౌందర్య గురించి చెప్పలేదే అనే బాధ కలిగింది. తాజాగా వెంకీమామ గురించి మాట్లాడుతున్నప్పుడు సౌందర్య పేరు పలకాల్సి రావడంతో ఆమె గురించి ఆలోచన నాలో కలిగింది. ఈమధ్య వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే ఆమె ఉంటే బాగుండేదేమో అనిపించింది. సౌందర్య 100కు పైగా సినిమాల్లో నటిస్తే, మేము ఎనిమిది సినిమాలకు మాత్రమే మేము మాటలు రాశాం. సౌందర్యను చూసినప్పుడల్లా నాకు ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనే కంటే, ఇలాంటి సోదరి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ అందరికీ కలిగేది. సావిత్రిని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలగడం అరుదు. ఓ హీరోయిన్‌ చూసి చెల్లెలు అనే ఫీలింగ్ రావడం విశేషమే. 1993లో సౌందర్యతో ఇన్స్‌పెక్టర్ ఝాన్సీతో మేము కలిసి పనిచేశాం. అప్పుడు ఆమెలో వినయం, పెద్దలకు ఇచ్చే గౌరవం చూసి పెద్ద స్టార్ అవుతుందని అనుకొన్నాం. అంతలోనే అమ్మోరుతో మంచి నటిగా పేరు తెచ్చుకొన్నది. ఆజాద్ సినిమాలో ఆమెతో కలిసి పని చేశాం. సంవత్సరాలు గడిచి స్టార్ హీరోయిన్‌గా మారినా గానీ ఆమె వినయంలో మార్పు రాలేదు. కొంచెం కూడా గర్వం కనపించలేదు అని పరుచూరి తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఆజాద్ సినిమా షూటింగ్‌లో మాకు సౌందర్య ఆసక్తికరమైన విషయం చెప్పారు. మా నాన్న కూడా మీలాగే సినీ రచయిత అని నాతో చెప్పడంతో షాక్ తిన్నాను. ఎందుకంటే ఓ రచయిత కూతురు ఇంత గొప్పగా ఎదిగిందంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఆమె ఇప్పుడు ఉంటే, ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసి ఉండే వారు. ఆమె అద్భుతమైన నటి. సౌందర్యతో నాకు మరిచిపోలేని మెమొరీ ఉంది. ఏప్రిల్ 17, 2004 లో నేను సాహిత్యంలో డాక్టరేట్ అందుకొనే రోజు. నా తల్లి కోరిక తీరబోతున్న సమయం. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఆ సమయంలో ఓ విలేఖరి నా వద్దకు వచ్చి విషాద సంఘటన అంటూ హెలికాప్టర్ క్రాష్ అంటూ వార్త చెప్పారు. ఆ ప్రమాదంలో సౌందర్య చనిపోయారని చెప్పగానే నా బాధ చెప్పలేనిది. నా తల్లి కోరుకొన్న కోరికను నెరవేర్చుకొంటున్న సమయంలో సౌందర్య విషాద వార్త వినడం తీరని లోటు. సౌందర్య మరణం ఊహించలేనిది. వాస్తవానికి ఆమె విమానంలో రావాల్సింది. కానీ ఆప్తమిత్ర షూటింగ్‌ కారణంగా విమానం మిస్ అయింది. అందుచేత హెలికాప్టర్‌లో బయలు దేరారు. ఒకవేళ విమానంలో వచ్చి ఉంటే ఓ అద్భుత నటి మన నుంచి దూరం అయ్యేది కాదు. ఆమె లేని లోటు నిజంగా పూడ్చలేనిది అంటూ పరుచూరి ఎమోషనల్ అవుతూ చెప్పారు. పరుచూరి చెప్పిన మాటలు నిజం. సావిత్రి తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకుంది. మళ్ళి తెలుగులో గానీ, సౌత్ ఇండియాలో గానీ సౌందర్య లాంటి గొప్ప నటి పుట్టదు. ఈమె ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి: