పవన్, క్రిష్ సినిమాకు అదిరిపోయే టైటిల్… ఫాన్స్ కు పూనకాలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మళ్ళి సినిమాలను మొదలుపెట్టాడు. ఈ మధ్యనే బాలీవుడ్ హిట్ మూవీ అయిన ‘పింక్’ రీమేక్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నివేతా థామస్, అనన్య కలిసి నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి లాయర్ సాబ్, వకిల్ సాబ్ అనే టైటిల్స్ ని పరిశీలనలో ఉంచారు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల కాబోతుంది.

Image result for pawan kalyan krish movie

ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ మరో సినిమాను కూడా స్టార్ట్ చేసాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఓ దొంగగా నటించబోతున్నాడట. మొఘలాయుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు ‘విరుపాక్షి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 18వ శతాబ్దం నాటి రాబిన్ హుడ్ తరహాలో పవన్ పాత్ర ఉంటుందట. పవన్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తుంది. విరూపాక్ష చివరి దశకు చేరుకున్న తర్వాత హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చెయ్యనున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను కూడా పవన్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు సినిమా తీసిన డాలీ ఒక కథ చెప్పాడని, దానికి పవన్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన బాబీ కూడా ఒక కథ రెడీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు అయినా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ముందు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఏ దర్శకుడి సినిమా చెయ్యాలో ఆలోచిస్తాడంట పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాలలోకి రావడం, కెరీర్ లో ఎన్నడూ లేనంతగా వరుసపెట్టి సినిమాలు చెయ్యడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation