అలీకి ఫోన్ చేసి బిగ్ షాకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్

1679

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోనూ ఆలీ నటించారు. అయితే ఇద్ద‌రి కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే, అయితే అన్నీ సినిమాల్లో ప‌వ‌న్ అలీ మ‌ద్య కామెడీని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు, ఇటు ప‌వ‌న్ క‌ల్యాన్ కు త్రివిక్ర‌మ్ ఎలాగో అలీ కూడా మంచి ప్రెండ్.. అయితే అలీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. అలాగే ప‌వ‌న్ క‌ల్యాన్ కూడా సొంతంగా పార్టీ పెట్టారు, ముఖ్యంగా ఎవ‌రికి అయినా విభేదాలు వ‌చ్చేది డ‌బ్బు లేదా రాజ‌కీయాలతోనే అని చెప్పాలి, తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య అలాంటి విభేదాలు వ‌చ్చాయి, అది కూడా రాజ‌కీయాల్లోనే.

Image result for pawan kalyan and ali

కిందటేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు, మనస్పర్థలు వచ్చాయి. అయితే, పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ పక్కనబెట్టి తన స్నేహితుడికి ఫోన్ చేశారని తాజాగా ప్రచారం జరిగింది. తన సినిమాలో నటించాలని ఆలీని పవన్ కోరినట్టు ప్రచారం చేశారు. ఈ రూమర్స్‌పై తాజాగా ఆలీ స్పందించారు.రాజకీయాలు, సినిమాలు వేరని.. తన స్నేహితుడి సినిమాలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ ఆలీ చెప్పారు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని ఇప్పటి వరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఎవరైనా సంప్రదిస్తే గనుక పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సినిమా కెరీర్‌ను రాజకీయాలతో ముడిపెట్టను’’ అని ఆలీ స్పష్టం చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తరఫున ఆలీ ప్రచారం నిర్వహించారు. అయితే, సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మందికి పదవులు ఇచ్చిన జగన్.. ఆలీకి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కానీ, ప్రస్తుతం వినిపిస్తోన్న గుసగుసలను పరిగణనలోకి తీసుకుంటే మార్చిలో జరగనున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల తరవాత ఆలీని ఓ కీలక పదవి కోసం నామినేట్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ పింక్ సినిమాలో న‌టిస్తున్నారు… అలాగే హ‌రీష్ శంక‌ర్ మ‌రో ద‌ర్శ‌కుడు క్రిష్ సినిమాలో కూడా న‌టిస్తున్నారు.. ఈరెండు సినిమాల్లో అలీకి క‌చ్చితంగా ఛాన్స్ ఉండే అవ‌కాశం ఉంటుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation