పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి, విడాకుల గురించి మీకు తెలియని సంచలన విషయాలు…

249

పవన్ కళ్యాణ్… ఈ పేరు వింటే చాలు కొన్ని కోట్ల మందికి పూనకం వస్తుంది. ఎందుకంటే ఆ పేరులోనే పవర్ ఉంది.. ఆయన మాటలోను పవర్ ఉంది.. ఎందుకు ఇంత ప్రేమ అంటే…. సమాజం అంటే ఆయనకు అమితమైన ప్రేమ ఉంది.. అంతకు మించి పిచ్చి ఉంది.. అందుకోసం తన ఆలోచల్ని ఇజంగా మార్చిన భావకుడతడు అతను. అందుకే ఆయనను అభిమానులు అంతలా ఆరాధిస్తారు. అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్ని కోట్ల మందికి దేవుడు. అయితే ఇంతటి అభిమానం ఆయనకు సినిమాల వల్లనే వచ్చింది. టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అతను. సినిమా జీవితంలో ఆయన స్టార్ అయినా కూడా అయన వ్యక్తిగత జీవితం అంత అద్భుతంగా లేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు ఆయనకు చాలా చెడ్డ పేరు తెచ్చాయనే చెప్పుకోవాలి. అయితే అయన రెండవ భార్య రేణుదేశాయ్ తో పెళ్లి, విడాకులు, ఆ తర్వాత అన్నలేజనోవాతో పెళ్లి గురించి అందరికి చాలా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి గురించి, భార్య గురించి చాలా తక్కువ మందికే తెలుసు.. ఇప్పుడు అయన మొదటి పెళ్లి, విడాకులకు సంబందించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి చెందిన నందినిని మొదటి వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 26 సంవత్సరాలు కాగా, ఆయన భార్య నందిని వయసు 19 ఏళ్ళు. మెగా ఫ్యామిలీ కుదిర్చిన ఈ వివాహం, వారి కుటుంబ సభ్యులు, పలువురు అతిథుల సమక్షంలో 1997 మే లో ఎంతో వైభవంగా జరిగింది. అయితే దాదాపుగా నాలుగేళ్లు ఎటువంటి అరమరికలు లేకుండా సాగిన వారి సంసారంలో 2000వ సంవత్సరం తరువాత కొద్దిపాటి కలతలు రేగాయి. దాంతో పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న తీరును మార్చుకోక‌పోవ‌డంతో మార్చి 2007న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు లీగ‌ల్ నోటీసులు పంపింది నందిని. అయితే అంత‌కు ముందే 1997 ఏప్రిల్‌ లోనే విడాకులు తీసుకునేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ మొగ్గు చూపాడ‌ట‌. నందిని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా వైజాగ్ వెళ్లిపోయినా అక్టోబ‌ర్ 2005 వ‌ర‌కు హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తీ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసేద‌ని, ఆ స‌మ‌యంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ తో పవన్ సహజీవనం చేస్తుండడంతో 2007లో నందిని, పవన్ పై కోర్ట్ లో కేసు వేసింది. అయితే అప్పటికే పవన్, రేణులకు 2004లోనే అకీరా నందన్ జన్మించడం జరిగింది.

పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి, విడాకుల గురించి మీకు తెలియని సంచలన విషయాలు....!!

దాంతో మెగాస్టార్ చిరంజీవి సహా, వారి ఫ్యామిలీలో మొత్తం 14 మందిపై కేసులు వేసిన నందిని, పవన్ నుండి తనకు విడాకులు కావాలని, అది మాత్రమే కాక కుటుంబ పోషణార్ధం నెలకు ఐదు లక్షల రూపాయలు భరణం కోరగా కోర్ట్ ఆమె కేసును కొట్టివేయగా, ఆమె ఉన్నత న్యాయస్థానం చేరి అక్కడ స్టే పొందింది. అయితే ఈ సమస్యను మరింత పెద్దదిగా చేయడం ఇష్టం లేని మెగా ఫ్యామిలీ, 2008 ఆగష్టు లో పవన్ నుండి నందినికి చట్టబద్ధంగా విడాకులు మంజూరు అయిన అనంతరం ఆమెకు ఐదు కోట్ల రూపాయలు భరణముగా చెల్లించారు. ఇక తరువాత కొన్నాళ్ళు ఒంటరిగా గడిపిన నందిని, 2010లో ఒక డాక్టరుని రెండవ వివాహం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యేకించి పవన్ కు, నందినికి ప్రత్యేకంగా వివాదాలు ఏవి లేవని, కాకపోతే కొన్ని కారణాల రీత్యా అనంతరం పవన్, రేణు దేశాయ్ ని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది. పెళ్ళైన తర్వాత వీరికి కూతురు ఆద్య పుట్టింది. ఆ తర్వాత రేణుదేశాయ్ తో మనస్పర్థలు రావడంతో ఆమె నుంచి నుండి విడిపోయి, రష్యన్ మోడల్ అన్న లెజెనోవాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation