ప్రభాస్ సంచలన నిర్ణయం.. కరోనా బాధితుల సహాయార్థం భారీ విరాళం…

161

కరోనా వైరస్ కారణంగా బీదా, గొప్ప, ఆడ, మగా తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. ఐతే.. కరోనాపై పోరాటానికి అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ బారిన పడకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశంలో తీవ్రంగా నష్టపోతున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోవడం వల్ల కొన్నివేల మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు వాళ్లను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో సహా పాపులర్ సినీ నటులంతా భారీగా విరాళాలు అందజేస్తున్నారు. అయితే అందరికన్నా ఎక్కువగా హీరో ప్రభాస్ డొనేట్ చేశాడు. ప్రభాస్ ఏకంగా 4 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు అందించగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి నిధికి చెరొక రూ.50 లక్షలు ప్రభాస్ అందించారు. అంటే దాదాపుగా రూ.4 కోట్లు కరోనా బాధితుల సహాయ నిధికి అందించారు.

Baahubali' actor Prabhas meets PM Narendra Modi - The Economic Times
కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

ఇక టాలీవుడ్ మిగతా హీరోలు కూడా భారీగానే డొనేట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక కోటి ప్రధాని సహాయనిధికి, 50 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి ఇస్తున్నట్టు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 75 లక్షలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 70 లక్షలు, హీరో నితిన్ 20 లక్షలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.20 లక్షల చొప్పున విరాళం అందజేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షలు, దర్శకుడు కొరటాల శివ రూ.10 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి 10 లక్షలు ఇచ్చాడు. ఇలా మన టాలీవుడ్ నుంచి భారీగానే విరాళాలు వచ్చాయి.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

కోలీవుడ్ ఇండస్త్రీ నుంచి కూడా భారీగానే విరాళాలు అందాయి.హీరో కార్తీ, రజనీకాంత్, సూర్య, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు భారీ విరాళాలు ప్రకటించారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్నో లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇలాంటి సమయంలో కాస్త ధనవంతులు ప్రభుత్వాలకు చేతనైన సహాయం చేయాలి. ఇప్పటికే ఆనంద్ మహీంద్ర, రతన్ టాటా, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల అధిపతులు తమ వంతు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందు ముందు వేరే సెలబ్రిటీలు కూడా దేశాన్ని కబలిస్టున్న ఈ వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వానికి తమ వంతు సాయం చేయడానికి ముందుకు రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Content above bottom navigation