దిల్‌రాజు కు మ‌ళ్లీ పెళ్లి అమ్మాయి ఎవ‌రో తెలిస్తే షాక్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. దిల్ రాజు భార్య అనిత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తగారింటికి వెళ్లిపోవడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారట. అందుకే మళ్లీ పెళ్లి చేసుకుని తన జీవితానికి ఓ తోడు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ నేపథ్యంలేని బ్రాహ్మణ యువతితో దిల్ రాజు పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందో తెలియాలంటే దిల్‌రాజే స్పందించాలి.

Image result for దిల్‌రాజు కు

తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసారు. 2003లో వచ్చిన ‘దిల్’ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తన పేరు ముందు ‘దిల్’ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఈరోజు ఆయన ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ‘జాను’ సినిమా ఇటీవల విడుదలైంది. కలెక్షన్లు బాగానే రాబడుతోంది. దిల్ రాజు బ్యానర్‌ నుంచి వచ్చిన తొలి రీమేక్ సినిమా ఇదే. ప్రస్తుతం దిల్ రాజు నాని నటిస్తున్న ‘v’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఐకాన్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అయితే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణం కుమార్తె అని అంటున్నారు, ఆమె వివాహం చేసుకుని వెళ్లిపోయింది, ఆయ‌న‌కు మనవరాలు కూడా ఉన్నారు.. కానీ మీకంటూ ఒకరుతోడు ఉండాలి అని కూతురు కోరింద‌ట, తండ్రికి తోడు ఉండాలి అని ఆమె కోర‌డంతో దిల్ రాజు వివాహం చేసుకోవాలి అని చూస్తున్నారు…. అందుకే ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.నిజానికి ఇదంతా దిల్ రాజు పెర్సనల్ విషయం. కానీ ఆయన ఇవ్వాళ రెండు రాష్ట్రాల్లో..తెలుగు ప్రజలకు సంబంధించి పెద్ద సెలబ్రిటీ. అందువల్ల ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation