పబ్ లో జరిగిన దాడిపై రాహుల్ తల్లి రియాక్షన్..

63

బిగ్ బాస్ 3 విజేత, గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి కొందరు స్నేహితులు, మహిళా స్నేహితురాలితో కలిసి సరదా ఎంజాయ్ చేసేందుకు గాను గచ్చిబౌలి లోని ఓ పబ్‌కి వెళ్ళాడు రాహుల్. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో మాటామాటా పెరిగి పెద్దదైంది. ఈ వివాదం మరింత ముదరడంతో ఇరువురు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో సదరు యువకులు బీరు సీసాలతో రాహుల్‌పై దాడికి దిగారు. ఈ క్రమంలో రాహుల్ తలపై బాదారు. దీంతో రాహుల్‌కి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాత్రి 11:45 గంటల ప్రాంతంలో జరిగింది. వెంటనే రాహుల్‌ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత రాహుల్ ఇంటికెళ్లిపోయాడు. ఇంత జరిగినా కూడా దాడి ఘటనపై ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయారు రాహుల్ సిప్లిగంజ్. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్‌ తల్లి ఈ దాడిపై స్పందించింది.

రాత్రి 11:45.. బీరు సీసాలతో

ఆమె ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం రాహుల్ ఇంటినుంచి వెళ్లాడని, రాత్రి ఇంటికి రాలేదని.. అయితే రాత్రి కాసేపు వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడాడని రాహుల్ తల్లి చెప్పింది. ఉదయం టీవీలో న్యూస్‌ చూశాకే తమకు దాడి గురించి తెలిసిందని ఆమె చెప్పడం విశేషం. ఓ పని మీద బయటకెళ్లిన తన కొడుకుపై ఇలా దాడి జరిగిందని తమకు తెలియలేదని, కనీసం రాహుల్ ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పింది రాహుల్ తల్లి. ఈ ఉదయం విషయం తెలియగానే తన భర్త హాస్పిటల్ వెళ్లాడని, తానూ కూడా ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళబోతున్నట్లు ఆమె తెలిపింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక ఈ దాడిపై కొద్దిసేపటి క్రితమే రాహుల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై కంప్లైంట్ ఇచ్చాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ ఈ ఘటనకు సంబంధించి విషయాలను మీడియాకు వివరించాడు. తనపై కావాలనే కొంతమంది యువకులు బీర్ బాటిల్స్‌తో దాడి చేశారని.. తలపై చిన్న గాయం మాత్రమే అయ్యిందని అన్నారు.. నేను ఒక్కడినే ఉన్నా, వాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు. అందరు ఒకేసారి వచ్చి దాడి చేశారు. బీర్ బాటిల్ పగలగొట్టి దాడి చేశారు. నాకు న్యాయం కావాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఇక ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation