రామ్ చరణ్ గొప్ప మనస్సు.. చనిపోయిన మెగా అభిమాని కుటుంబానికి భారీ ఆర్థిక సాయం!

55

సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సందర్భాలలో తాము రీల్ హీరోలమే కాదని రియల్ హీరోలమని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. తమ అభిమానులకు గాని, అభిమానుల కుటుంబాలకు గాని కష్టాలు ఉంటే తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున..ఇలా చాలామంది హీరోలు తన అభిమానులకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు. తాజాగా రామ్ చరణ్ అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.

Image result for chiranjeevi

కొన్ని నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఫ్యామిలీ అభిమానిగా కొనసాగుతున్న నూర్‌ భాయ్‌.. పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మెగా కుటుంబానికి మద్ధతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు నూర్‌. మెగా హీరోల అభిమానుల మధ్య ఎలాంటి చిన్న పొరపచ్చాలు వచ్చినా నూర్ భాయ్ సర్దుబాటు చేసిన సందర్భాలు అనేకం. సిటీలోని మెగా అభిమానుల్ని ఒక్కటిగా నడిపించడంలో, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన కృషి చాలా పెద్దది. అందుకే ఆయనంటే చిరుతో పాటు మెగా హీరోలందరికీ ఎంతో ఇష్టం. ఆయన్ను కేవలం అభిమానిగానే చూడకుండా కుటుంబంలోని వ్యక్తిగా చూసేవారు. అందుకే ఆయన చనిపోవడంతో మెగా ఫామిలీ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నూర్ మహ్మద్ మృతి చెందటంతో మెగాస్టార్ చిరంజీవి, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నూర్ మహ్మద్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. నూర్ మహ్మద్ చనిపోయిన సమయంలో రామ్ చరణ్ విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ తప్పకుండా నూర్ మహ్మద్ కుటుంబాన్ని ఆదుకుంటానని హైదరాబాద్ వచ్చిన తరువాత నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను కలుస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రింది వీడియోని చూడండి

చరణ్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ఈరోజు ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు కలిశాడు. 10 లక్షల రూపాయల చెక్కును నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ అందజేశాడు. రామ్ చరణ్ చేసిన సహాయం ఎప్పటికీ మరవలేమని, ఎప్పటికీ మా కుటుంబం అంతా రుణపడి ఉంటామని నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ… తమ కుటుంబం కొరకు నూర్ మహ్మద్ చేసిన సేవలు ఎనలేనివి అని అన్నారు. మా పుట్టిన రోజులకు, సినిమా ఫంక్షన్లకు నూర్ మహ్మద్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడని, అయితే ఏ రోజూ కూడా అయన చేసిన సేవా కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని నూర్ మహ్మద్ కోరుకోలేదని అన్నారు. నూర్ మహ్మద్ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ పెద్ద కొడుకులా అండగా ఉంటానని అన్నారు. నూర్ మహ్మద్ అమ్మాయిల పెళ్లికి తాను స్వయంగా వస్తానని పెద్ద కొడుకులా వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. ఇలా అభిమాని కుటుంబానికి సహాయం చేసి గొప్ప మనసులు చాటుకున్నాడు. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్, మా మెగా హీరోలు ఎంత గొప్పవాల్లో మరొకసారి నిరూపించారు అని అంటున్నారు. ఏది ఏమైనా తమను అభిమానించే అభిమాని కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా సహాయం చెయ్యడం గొప్ప విషయమే.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation