సుధీర్‌- రష్మీ ఎఫైర్.. ముఖం మీద ఉమ్మేసినా కూడా జబర్ధస్త్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

148

జబర్దస్త్ జోడీల్లో సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్ జోడీకున్న పాపులారిటీ ఎలాంటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోతుంటారు. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. కాగా తాజాగా సుధీర్ గురించి మాట్లాడుతూ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది రష్మీ. వివరాల్లోకి పోతే..రొమాన్స్ అంటే వీళ్లదే అన్నట్లుగా కెమెరా ముందు రెచ్చిపోతుంటారు సుధీర్- రష్మీ. రసిక ప్రియులకు కిక్కిచ్చేలా స్టెప్పులేస్తూ మాయ చేస్తుంటారు. అందుకే ఈ రొమాంటిక్ జోడీకి ఓ రేంజ్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాదు సుధీర్- రష్మీ ప్రేమలో మునిగితేలుతున్నారని ఫిక్స్ అయ్యారంతా.ఇకపోతే అమ్మాయిలను పడేయటంలో సుడిగాలి సుధీర్‌ని మించినోడు లేడని, ఎంతోమంది అమ్మాయిలతో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు విన్నాం.

హర్ట్ అయిన ఫ్యాన్స్..

ముఖ్యంగా రష్మీ- సుధీర్ మధ్య ఏదో నడుస్తోందని గత కొన్నేళ్లుగా వింటూ వస్తున్నాం. ఈ ఎఫైర్స్ కారణంగానే సుధీర్‌కి పెళ్లి కావడం లేదని చెప్పుకుంటున్నారు జనం.అయితే తమ ప్రేమాయణం గురించి రూమర్స్ బాగా పెరిగిపోతుండటంతో తాము ప్రేమలో లేమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు రష్మీ- సుధీర్. దీంతో కొంతమేర వీరిద్దరి ప్రేమాయణంపై వార్తల ప్రవాహం తగ్గింది. అయితే ఆ రూమర్స్‌ని బలోపేతం చేస్తూ తాజాగా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో సెన్సషనల్ కామెంట్స్ చేసింది రష్మీ.గత శుక్రవారం ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే పేరు మీద సుడిగాలి సుధీర్ స్కిట్ చేశాడు. ఈ స్కిట్‌లో ప్రదీప్ కూడా ఉన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ స్కిట్ లో భాగమైన రష్మీ.. ప్రదీప్‌తో సుధీర్ గురించి చెబుతూ సంచలనం సృష్టించింది.తనను సుధీర్ ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడని, వాడిని ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదని ప్రదీప్‌తో చెప్పింది రష్మీ. అంతటితో ఆగక, ఛీ అన్నా, చెప్పుతో కొట్టినా, ముఖం మీద ఉమ్మేసినా కూడా సుధీర్ తనను ప్రేమిస్తూనే ఉన్నాడంటూ, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోయింది.దీంతో రష్మీ- సుధీర్ ప్రేమాయణం టాపిక్ మరోసారి హాట్ ఇష్యూగా మారింది. కాకపోతే రష్మీ చేసిన కామెంట్స్ సుధీర్ అభిమానులను కాస్త నొప్పించాయి. ఏదేమైనా రష్మీ- సుధీర్ ఎఫ్ఫైర్ ఎప్పుడైనా హాట్ ఇష్యూనే సుమా!.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation