రష్మిక మందనకు బలవంతంగా ముద్దు పెట్టేసిన అభిమాని… షాక్ లో అమ్మడు

90

క‌న్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ . ఏ స్టార్ హీరోతో సినిమా అన్నా ముందు ద‌ర్శక నిర్మాత‌లు యువ హీరోలు ఆమెని హీరోయిన్ గా తీసుకోమంటున్నారు.యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.టాప్ హీరోల‌తో సినిమాలు సెట్స్ పై పెట్టింది. వ‌రుస అవ‌కాశాల‌తో టాలీవుడ్ లో బిజిఎస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.స‌రిలేరు నీకెవ్వ‌రుతో జ‌న‌వ‌రిలో సంద‌డి చేస్తే ఫ్రిబ్ర‌వ‌రిలో భీష్మ‌తో వెండితెర‌పై అలరించ‌నుంది.సరిగ్గా అరడజను సినిమాలు చేసిందో లేదో కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు . అలాగే తెలుగుతో పాటు తమిళం మరియు కన్నడంలో కూడా ఈ ముద్దుగుమ్మ జోరు మామూలుగా లేదు . మూడు భాషల్లో కూడా విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేకానేక వార్తలలో ఫోకస్ పాయింట్ గా నిలుస్తోంది . కొద్ది రోజుల క్రితమే తనకు కుక్క బిస్కెట్ తినే అలవాటు ఉందని హీరో నితిన్ చెప్పడం బాగా వైరల్ అయిపోయింది .

Image result for rashmika mandanna

అయితే ఇప్పుడు రష్మిక మందనకు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కర్ణాటకలో రష్మిక తన ఇంట్లో ఉండగా కొందరు అభిమానులు ఆమెను కలిసేందుకు వెళ్లారు . ఆ తర్వాత బయటకు వచ్చిన రష్మిక వారందరికీ సెల్ఫీ ఇస్తూ ఉండగా ఆ సమయంలో ఆమె తో సెల్ఫీ తీసుకోవడానికి చాలామంది ఎగబడ్డారు . అయితే ఆమెతో సెల్ఫీ కోసం అంతా పోటీపడుతున్న సమయంలో ఒకతను రష్మిక కు చాలా దగ్గరగా వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నట్లు తీసుకొని ఏకంగా అమ్మడు బుగ్గపై ముద్దు పెట్టి పారిపోయాడు .

ఈ క్రింది వీడియోని చూడండి

తన దగ్గరికి వచ్చి ఫోటోకి ఫోజ్ ఇస్తున్నట్లు ఇచ్చి తన చేయి బలవంతంగా లాగి ముద్దు పెట్టి అక్కడి నుంచి అతను పరారయ్యాడు… ఒక్క‌సారిగా అభిమాని చేసిన ఆ పనికి రేష్మిక తో సహా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు . ఆమె బాడీగార్డ్స్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపలే అతను కాస్తా పారిపోయాడు . దాని తర్వాత ఆశ్చర్యపోవడం రష్మిక వంతు అయింది . సెల్ఫీ పేరుతో ఇలాంటివి ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇటీవలే మంత్రి కడియం ఒకరు దొంగలించగా ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోయిన్ కే ముద్దు పెట్టేసారు . అందుకే ఇప్పుడు సెల్ఫీ ఇచ్చేందుకు సెలబ్రిటీలు అంతా భయపడుతున్నారు …. అందుకే కొంచెం సెల్పీలు తీసుకునే వారు కూడా ఆలోచించండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation